
వివాదాలకు , పబ్లిసిటీకి , నిత్యం వార్తల్లో నిలువడానికి వర్మ తర్వాతే ఎవరైనా..ఇక రాత్రియితే చాలు వర్మ పీకల్లోతు మందేస్తూ నానా రచ్చ చేస్తాడు. ఆ టైములో తనకు ఏమనిపిస్తే అది చేస్తూ..ఏమనాలనిపిస్తే అది అంటుంటాడు. తాజాగా అలాగే రచ్చ చేసాడు. మందు గ్లాస్ తో ఉన్న ఛార్మి పిక్ ను పోస్ట్ చేసి వామ్మో అనిపించాడు.
జూమిన్ లెన్స్ తో ఛార్మి మందు గ్లాస్ తో పట్టుకున్న పిక్ ను షేర్ చేసాడు. ఇదిగో సర్కారీ.. తనతో కలిసి డ్రింక్ పుచ్చుకున్నానని ఫోటో ఆధారంతో బయటపెట్టేసారు. అంతే కాదు తనలోని కెమెరామెన్ ను మరోసారి బయటకు తీసాడు. ఈ మధ్య యాంకర్లను , హీరోయిన్లను కింది నుండి చూపిస్తూ తన పైత్యాన్ని చూపిస్తున్న వర్మ..ఛార్మి ని కూడా అలాగే తీసి తన పైత్యాన్ని చూపించాడు. వోడ్కా కిక్ తో వర్మ నేలపై పడి ఈ ఫోటో తీసినట్లు ఉందని అర్ధమవుతుంది. మొత్తం మీద వర్మ మందేస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. మరి ఇందులో పూరి మిస్ అయ్యాడేంటొ మరి.