
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ మూవీ ఫై వివాదాస్పద దర్శకులు రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్ చేసాడు. ‘రాధేశ్యామ్‌లో హీరో ప్రభాస్ పారితోషికం పక్కన పెడితే.. ఈ చిత్రం మొత్తం బడ్జెట్‌లో 5వ వంతు ఖర్చుతో సినిమా తీసేయవచ్చు. రాధేశ్యామ్ వంటి ఇంటెన్స్ లవ్‌స్టోరీ అభిమానులకు విజువల్ ఫీస్ట్ అవసరం లేదు. కథలోని భావోద్వేగం, భావాలను విజువల్ ఫిస్ట్ డ్యామినేట్ చేస్తాయి, ఇది కథను చంపేస్తుంది’ అని అన్నాడు.
ఇక బాలీవుడ్ చిత్రం ది కశ్మీర్ ఫైల్స్ గురించి విడుదలయ్యే వరకు ఎవరికి తెలియదు, కేవలం రూ. 4 కోట్లనుంచి రూ. 5 కోట్లతో తెరకెక్కిన ఆ మూవీ ఇప్పుడు రూ. 100 కోట్ల వసూళు సాధించిందని పేర్కొన్నాడు. అదే రాధేశ్యామ్ మూవీకి పెట్టిన బడ్జెట్, వచ్చిన వసూళ్లకు పొంతన లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇక ఒక మూవీకి విజువల్ ఎఫేక్ట్స్ కంటే కథలో ఉండే దమ్ము ముఖ్యమని ఈ రెండు సినిమాలు నిరూపించాయని వర్మ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం వర్మ కామెంట్స్ ఫై అంత పాజిటివ్ గా స్పందిస్తున్నారు.