
నిర్మాత నట్టికుమార్..రామ్ గోపాల్ వర్మ కు భారీ షాక్ ఇచ్చారు. వర్మ తెరకెక్కించిన డేంజరస్ మూవీ రేపు రిలీజ్ అవుతుండగా…వర్మ ఫై కోర్ట్ లు కేసు వేసి సినిమా రిలీజ్ కు బ్రేక్ పడేలా చేసాడు నట్టి కుమార్. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనకు 5 కోట్ల 29 లక్షలు ఇవ్వాలని.. డబ్బులు ఇవ్వకుండా ఆర్జీవీ తప్పించుకుంటున్నాడని నట్టి కుమార్ పిటిషన్ లో పేర్కొన్నారు.
ప్రతి సినిమాకు 50 లక్షలు ఇవ్వాలన్న నిబంధనలను రాంగోపాల్ వర్మ తుంగలో తొక్కినట్టు నట్టి కుమార్ ఆరోపించారు. ఈ మేరకు కోర్టు వాదప్రతివాదనలు విన్న తర్వాత ఆర్జీవీ తీసిన ‘మా ఇష్టం’ (డేంజరస్) సినిమా రిలీజ్ ను ఆపాలని సిటీ సివిల్ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా ఈ చిత్రాన్ని ప్రదర్శించినా ప్రదర్శనకు సహకరించినా కాంటెంప్ట్ అఫ్ కోర్ట్ అవుతుందని సూచించింది.
ఇక రిలీజ్ కు బ్రేక్ పడడంతో వర్మ ట్విట్టర్ లో స్పందించాడు. ”మా ఇష్టం” DANGEROUS సినిమా విడుదల విషయంలో లెస్బియన్ సబ్జెక్ట్ మూలాన చాలా థియేటర్స్ కోపరేట్ చేయలేని దృష్ట్యా సినిమా విడుదలను పోస్ట్ ఫోన్ చేస్తున్నామని వర్మ తన ట్విట్టర్ ద్వారా తెలియపరిచారు. ఈ అన్యాయాన్ని ఎలా ఎదుర్కోవాలో పరిశీలించి తగు చర్యలు తీసుకున్న తరువాత విడుదల తేదీని ప్రకటిస్తాం అని చెప్పారు.