Homeటాప్ స్టోరీస్వర్మ విశ్వక్ సేన్ మెచ్చుకున్నాడా..లేక దేవి నాగవల్లి నా..?

వర్మ విశ్వక్ సేన్ మెచ్చుకున్నాడా..లేక దేవి నాగవల్లి నా..?

varma comments vishwak sen-devi nagavalli issue
varma comments vishwak sen-devi nagavalli issue

వివాదాలకు కేరాఫ్ గా నిలిచే రామ్ గోపాల్ వర్మ…ప్రస్తుతం ఏదైనా ఇంట్రస్టింగ్ టాపిక్ నడుస్తుందంటే..దంపి తనదైన కామెంట్స్ చేసి మరింత వైరల్ చేస్తుంటారు. తాజాగా tv9 ఛానల్ లో విశ్వక్ సేన్ – యాంకర్ నాగవల్లి కి జరిగిన ఇష్యూ ఫై వర్మ కామెంట్స్ చేసాడు.

పురుషుడి కన్నా పవర్ ఫుల్ గా మహిళ కనిపించడం నేను ఇంత వరకు చూడలేదు. ఆమె సర్కార్ కన్నా తక్కువేం కాదంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. అయితే వర్మ ఈ ట్వీట్ ను పొగుడుతూ చేశాడో… వెతకారంతో చేశాడో తెలియడం లేదు.

- Advertisement -

ఇక హీరో విశ్వక్ సేన్ నటించిన తాజాగా చిత్రం ‘అశోకవనంలో అర్జున కల్యాణం’. ఈ మూవీ మే 06 న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని. సినిమా ప్రమోషన్ కోసం హీరో విశ్వక్ సేన్ చేసిన ఓ ప్రాంక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో ఫై కొంతమంది విమర్శలు చేస్తుంటే..మరికొంతమంది విశ్వక్ కు మద్దతు తెలుపుతున్నారు.

ఈ ఘటన పట్ల tv9 ఛానల్ లో డిబేట్ చేయడం..డిబేట్ జరుగుతున్న క్రమంలో విశ్వక్ సేన్ ను సదరు యాంకర్ ‘పాగల్ సేన్’ ‘డిప్రెస్డ్ పర్సన్’ అంటూ సంబోధించడం పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మాటలకు హార్ట్ అయిన విశ్వక్.. తనను పర్సనల్ గా టార్గెట్ చేసినందుకు పరువునష్టం దావా వేసే హక్కు ఉందని.. కానీ అలా చేస్తే వారికి తనకు తేడా ఏముందని విశ్వక్ అన్నారు. అలాంటి మాటలు అనొద్దని.. మాటలను అదుపులో పెట్టుకొని మాట్లాడాలని గట్టిగా చెప్పారు. దీంతో సహనం కోల్పోయిన సదరు యాంకర్.. ‘గెట్ ఔట్’ అంటూ తన షో నుంచి వెళ్లిపోవాలని గట్టి గట్టిగా అరుస్తూ విశ్వక్ సేన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో విశ్వక్ బయటకు వచ్చాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All