
తమిళంలో హీరోయిన్‌గా అలాగే విలక్షణ పాత్రల్లో నటించి.. మంచి గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మి..తెలుగు లో క్రాక్ , నాంది సినిమాలతో ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని – బాలకృష్ణ కాంబినేషన్‌లో రూపొందుతున్నసినిమా తో పాటు .. సమంత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యశోద సినిమాలో తేజ సజ్జ హీరోగా చేస్తున్న హనుమాన్ మూవీ లో నటిస్తుంది.
ఇదిలా ఉంటె ఈరోజు వరలక్ష్మి పుట్టిన రోజు సందర్భాంగా సోషల్ మీడియా లో అభిమానులు , సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున ఆమెకు బర్త్ డే విషెష్ అందిస్తూ వారి అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో యశోద మేకర్స్ వరలక్ష్మి తాలూకా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ మూవీ లో వరలక్ష్మి మధుబాల పాత్ర లో కనిపించబోతుంది. సెట్స్‌పై ఉన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాను శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 14గా శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. హరి – హరీష్… ఇద్దరు యువకులు ఈ సినిమాతో దర్శకులుగా పరిచయం అవుతున్నారు.