Homeటాప్ స్టోరీస్విశాల్ పెళ్లిపై సంచలన కామెంట్ చేసిన వరలక్ష్మీ

విశాల్ పెళ్లిపై సంచలన కామెంట్ చేసిన వరలక్ష్మీ

Varalakshmi sharath kumar sensational comments on vishal విశాల్ తొందరగా పెళ్లి చేసుకో ….. ఇంకా లేటైతే నీకు పిల్లని ఎవరూ ఇవ్వరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది నటి వరలక్ష్మీ శరత్ కుమార్. విశాల్వరలక్ష్మీ ల మధ్య ప్రేమ వ్యవహారం జోరుగా సాగుతోందని చాలాకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే అలా వార్తలు వచ్చిన ప్రతీసారి ఆ వార్తలను కొట్టి పడేసారు. మేము కేవలం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అంటూ చెప్పొకొచ్చారు. కానీ వాళ్ల మాటలను మాత్రం ఎవరూ నమ్మడం లేదు కూడా. ఇక తాజా విషయానికి వస్తే…… విశాల్ ని ఉద్దేశించి వరలక్ష్మీ చేసిన కామెంట్స్ మాత్రం సంచలనం సృష్టిస్తున్నాయి.

విశాల్ ఏజ్ మీద పడుతోంది కాబట్టి ముదురుబెండకాయ కాకముందే పెళ్లి చేసుకో …..లేదంటే ఎవరూ నీకు పిల్లని ఇవ్వరు అంటూ కామెంట్ చేయడం వెనుక అసలు ఉద్దేశ్యం వేరే ఉందని తెలుస్తోంది. నడిగర్ సంఘం కల్యాణ మండపం కట్టి అందులో మొదటి పెళ్లి నేనే చేసుకుంటాను అని అంటున్నాడు విశాల్. అయితే ఆ మండపం ఆలస్యం అవుతోంది అలాగే వరలక్ష్మీ , విశాల్ ల పెళ్లి కూడా ఆలస్యం అవుతోంది దాంతో త్వరగా నన్ను పెళ్లి చేసుకో అని చెప్పకనే చెబుతోందా ? అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు పలువురు. ఇక ఈ ఇద్దరూ కలిసి తాజాగా నటించిన పందెం కోడి 2 విడుదల అయ్యింది. అయితే తెలుగునాట పందెం కోడి 2 అంతగా ఆడటం లేదు కానీ తమిళనాడులో మాత్రం బాగానే వసూల్ చేస్తోంది.

- Advertisement -

English Title: Varalakshmi sharath kumar sensational comments on vishal

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All