Homeటాప్ స్టోరీస్కొండపొలం : రివ్యూ

కొండపొలం : రివ్యూ

Vaishnav Tej Kondapolam Review Rating
Vaishnav Tej Kondapolam Review Rating

మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా కొండపొలం. వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ఫస్ట్ ఫేం ఎంటర్టైన్మెంట్స్ లో రాజీవ్ రెడ్డి, సాయి బాబు నిర్మించారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

- Advertisement -

కడప జిల్లాకు చెందిన రవీంద్ర యాదవ్ (వైష్ణవ్ తేజ్) బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉంటాడు. అయితే ఎంత ప్రయత్నించినా జాబ్ రాకపోవడంతో సిటీలో ఉండలేక తన ఊరికి వెళ్తాడు. ఊళ్లో తాత రోశయ్య (కోటా శ్రీనివాస్ రావు) సలహా మేరకు కరువు కారణంగా అల్లల్లాడుతున్న ఊరి గొర్రెల మందతో కొండపొలం చేస్తున్నారని.. వారితో కలిసి నల్లమల అడవికి వెళ్లమని చెబుతాడు. తాత చెప్పిన మాట ప్రకారం అడవిలో నెలరోజులు సహజెవనం చేశాక అతనిలో ఎలాంటి మార్పు వచ్చింది..? అడవి రవీంద్రకు ఏం నేర్పించింద్ది..? ఆ అనుభవం జీవితంలో ఎలా ఉపయోగపడ్డది అన్నది సినిమా కథ.

విశ్లేషణ :

ఒకప్పుడు నవలా రచనలను సినిమాలుగా మలిచే వారు. కాని ఇప్పుడు అలా చేయడం తగ్గింది. ఇక కొండపొలం సినిమా సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన కొండపొలం నవల ఆధారంగా తెరకెక్కించిన సినిమా. తానా నవల పోటీల్లో ఈ కథ మొదటిస్థానంలో నిలిచి రెండు లక్షల బహుమతిని అందుకుంది. ఇక ఈ కథను సినిమాగా తెరకెక్కించడంలో దర్శకుడు క్రిష్ సక్సెస్ అయ్యారని చెప్పాలి.

నవల కథ అయినా క్రిష్ ఈ కథను తెరకెక్కించిన విధానం ఇంప్రెస్ చేస్తుంది. పాత్రల ఎంపిక.. పాత్ర దారుల స్వభావం అన్ని కథకు తగినట్టుగా బాగున్నాయి. రాయలసీమ మనుషుల్లో మానవత్వం.. పశువుల మీద వారి ప్రేమ.. అభిమానం ఈ సినిమాలో బాగా చూపించారు. నల్లమల అడవులకు పెద్దపులి ఫైట్ ఆడియెన్స్ ను అలరిస్తుంది. పశువులను కాపాడటానికి వారు ఎంత మదనపడతారో చాలా బాగా చూపించారు. అడవితో మనిషికి.. మరోపక్క మనుషులకు.. పశువులకు ఉన్న బంధాన్ని బాగా చూపించాడు దర్శకుడు క్రిష్. అంతేకాదు సినిమాలో ఒక చక్కని ప్రేమకథ కూడా చూపించాడు.

నటీనటుల ప్రతిభ :

రవీంద్ర యాదవ్ పాత్రలో వైష్ణవ్ తేజ్ నటన ఆకట్టుకుంది. చాలా చోట్ల వైష్ణవ్ తేజ్ క్లోజప్ షాట్స్ తో సీన్ కన్వే చేసేందుకు ప్రయత్నించి సక్సెస్ అయ్యాడు. ఇక ఓబులమ్మ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ చాలా బాగా చేసింది. ఒకానొక టైం లో రకుల్ పాత్ర రవీంద్ర పాత్రని డామినేట్ చేసినట్టు అనిపిస్తుంది. రవీంద్ర తాతయ్య పాత్రలో కోటా శ్రీనివాస్ రావు ఎప్పటిలానే అదరగొట్టేశారు. సాయిచంద్ కూడ్డా మరోసారి గురప్ప పారలో బాగా చేశారు. రవిప్రకాష్, మహేష్ విట్ట, అశోక్ వర్ధన్, రచ్చ రవి, ఆంధోని, హేమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

సాంకేతికవర్గం :

కథతో పాటుగా అద్భుతమైన మాటలను ఈ సినిమాకు అందించారు రచయిత సన్నపురెడ్డి. సినిమాలో కొన్ని డైలాగ్స్ హృదయానికి హత్తుకునేలా ఉంటాయి. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది. అడవి అందాలు బాగా చూపించారు. కీరవాణి మ్యూజిక్ సినిమాకు మరో హైలెట్ అని చెప్పొచ్చు. డైరక్టర్ క్రిష్ మరోసారి తన టాలెంట్ చూపించారు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :

కథ, కథనం

డైలాగ్స్

మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్ కొద్దిగ స్లో అనిపించడం

అక్కడక్కడ ల్యాగ్ అవడం

రేటింగ్: 3/5

బాటం లైన్ : కొండపొలం.. మెప్పించే ప్రయత్నం..!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All