
దర్శకులకి చాలా కథలు ఒక డ్రీం ప్రాజెక్ట్ లాగ ఉండిపోతాయి. వాటిని కథ, కథనం పరంగా సిద్ధం చేసుకొని సమయం వచ్చినప్పుడు తీసేద్దాం అని పక్కకి పెట్టి, మిగిలిన సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతారు. డ్రీం ప్రాజెక్ట్ లో వీళ్ళు మాత్రమే నటించాలి అని అనుకుంటారు కొంతమంది దర్శకులు అందుకే లేట్ అయినా పర్లేదు కానీ డ్రీం ప్రాజెక్ట్ ని అనుకున్నట్టుగా తీయాలి అని డిసైడ్ అయిపోతారు.
దర్శకులు వి.వి.వినాయక్ గారికి అలా రెండు కలలు ఉన్నాయని మీడియా ముంది వివరించారు. ఇదంతా ఎప్పుడు జరిగింది అంటే……వి.వి.వినాయక్ గారు హీరోగా, దిల్ రాజు గారు నిర్మాతగా, ఎన్ నరసింహ దర్శకుడిగా చిత్రీకరిస్తున్న సినిమా ‘సీనయ్య’. దీంట్లో మెకానిక్ గా వి.వి.వినాయక్ గారు నటించబోతున్నారు. అప్పటికి నెటిజన్లు వినాయక్ గారిని ట్రోల్ చేస్తూ పలు రూమర్లు కూడా వచ్చాయి. వాటిని ఏ మాత్రం లెక్కచేయని వినాయక్ గారు సీనయ్య సినిమా గురించి మీడియా ముందు మాట్లాడారు.
అందులో ఒక రిపోర్టర్ మీ డ్రీం ప్రాజెక్ట్ ఏంటి అని అడగగా ఇలా బదులిచ్చారు. “నాకు తారక్ హీరోగా ‘దాన వీర శూర కర్ణ’ సినిమాని డైరెక్ట్ చేయాలి అని ఉందని అలాగే మహాభారతం లాంటి పెద్ద సినిమాని ఎస్. ఎస్.రాజమౌళి గారు మన టాలీవుడ్ హీరోలందరిని వారి పాత్రలకి తగిన విధంగా మలిచి డైరెక్ట్ చేస్తే చూడాలి” అని మీడియా ముందు తన కలని, రాజమౌళి గారి కలని కూడా చెప్పేసారు.
నిజానికి వి. వి. వినాయక్ గారికి వరుస ఫ్లాప్ లు లేకపోతే ‘దాన వీర శూర కర్ణ’ సినిమాని తీసేవారు అని తారక్ అబిమానులు అనుకుంటున్నారు.