Homeగాసిప్స్గోపీచంద్ చిత్రంలో బాలీవుడ్ హాటీ!

గోపీచంద్ చిత్రంలో బాలీవుడ్ హాటీ!

గోపీచంద్ చిత్రంలో బాలీవుడ్ హాటీ!
గోపీచంద్ చిత్రంలో బాలీవుడ్ హాటీ!

మ్యాచో మ్యాన్ గోపీచంద్ హీరోగా తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `సీటీమార్‌`. సంప‌త్ నంది ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. `చెక్‌దే` ఇండియా స్ఫూర్తితో ఈ చిత్రాన్ని ఫుల్‌బాల్ గేమ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో త‌మ‌న్నా జ్వాలా రెడ్డిగా ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టిస్తోంది. ఇప్ప‌టికే కీ షెడ్యూల్‌ని పూర్తి చేశారు.

క‌రోనా వైర‌స్ కార‌ణంగా రెగ్యుల‌ర్ షూటింగ్‌ని వాయిదా వేశారు. ఇదిలా వుంటే ఈ చిత్రంలోని ఓ కీల‌క పాత్ర కోసం బాలీవుడ్ హాట్ ఆట‌మ్ బాంబ్ ఊర్వ‌శీ రౌతేలాని తీసుకున్న‌ట్టు తెలిసింది. స‌న‌మ్ రే,  గ్రేట్ గ్రాండ్ మ‌స్తీ, హేట్ స్టోరీ 4, పాగ‌ల్ పంతి,  వంటి చిత్రాల్లో త‌న అందాల‌తో ప్రేక్ష‌కుల్ని స‌మ్మోహితుల్ని చేసింది. ప్ర‌స్తుతం హిందీ చిత్రం `వ‌ర్జిన్ భానుప్రియ‌` చిత్రంలో న‌టిస్తోంది.

- Advertisement -

`సీటీమార్‌` చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇస్తున్న ఈ హాట్ ఆట‌మ్ బాంబ్ తెలుగు చిత్రాల‌పై క‌న్నేసింద‌ని చెబుతున్నారు. ఈ సినిమా త‌రువాత తెలుగులో వ‌రుస చిత్రాల్లో న‌టించాల‌ని, ఇప్ప‌టికే తెలుగు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ఫోన్‌లు చేస్తోంద‌ట‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All