Homeటాప్ స్టోరీస్`ఉప్పెన` డైరెక్ట‌ర్‌ని ఎన్టీఆర్ అంత మాట‌న్నాడా?

`ఉప్పెన` డైరెక్ట‌ర్‌ని ఎన్టీఆర్ అంత మాట‌న్నాడా?

Uppena director bucchibabu sensational comments on ntr
Uppena director bucchibabu sensational comments on ntr

మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం `ఉప్పెన‌`. ఈ చిత్రం ద్వారా స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ప్రేమ‌క‌థా చిత్రంగా తెర‌కెక్కిన ఈ మూవీ ఈ 12న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సంద‌ర్భంగా ఈ మూవీ ప్ర‌మోష‌న్‌లో భాగంగా ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు ప‌లు ఆస‌క్తిర విష‌యాల్ని వెల్లడించారు.

ఓ యూట్యూబ్ చాన‌ల్ కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో బుచ్చిబాబు సానా ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించి షాకిచ్చారు. బుచ్చిబాబు `నాన్న‌కు ప్రేమ‌తో` చిత్రానికి అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేశారు. ఆ స‌మ‌యంలో విదేశాల్లో ఎన్టీఆర్‌తో ఓ పాట‌ని చిత్రీక‌రిస్తున్నార‌ట‌. ఈ సంద‌ర్భంలోనే ఎన్టీఆర్ కు బుచ్చిబాబు `ఉప్పెన‌` క‌థ వినిపించాడ‌.

- Advertisement -

క‌థ మొత్తం విన్న ఎన్టీఆర్ బాగుంది. ఎక్క‌డ‌ కొట్టేశావ్‌రా అన్నార‌ట‌. ఇది మీకు కాద‌ని ఓ కొత్త హీరో కోస‌మని బుచ్చి బాబు వెంట‌నే చెప్పాడ‌ట‌. దీంతో క‌థ బాగుంద‌ని ఎన్టీఆర్ అత‌న్ని అభినందించిన‌ట్టు వెల్ల‌డించాడు. అంతే కాకుండా త‌ను అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌ని అయినా త‌న‌తో ఎన్టీఆర్ స‌న్నిహితంగా వుండేవార‌ని ఈ సంద‌ర్భంగా గుర్తిచేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు నెట్టింట సంద‌డి చేస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All