
మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో ఓ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. వచ్చే నెలలో ఈ మూవీ సెట్స్ ఫైకి రాబోతుందని అంటున్నారు. గతంలో వీరిద్దరి కలయికలో అతడు , ఖలేజా చిత్రాలు వచ్చి ప్రేక్షకులను , అభిమానులను ఆకట్టుకున్నాయి. దీంతో ఇప్పుడు మూడోసారి వీరిద్దరి కాంబో లో మూవీ అనగానే అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
ఇక ఈ మూవీ లో కన్నడ యాక్టర్ ఉపేంద్ర ఓ కీలక రోల్ లో కనిపించబోతాడనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. అంతకుముందు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ సినిమాలోనూ ఉపేంద్ర కీలక పాత్ర పోషించారు. ఇక ఈ మూవీలో హీరోయిన్గా పూజాహెగ్డే నటించనుంది.
- Advertisement -