Homeటాప్ స్టోరీస్వరుణ్ తేజ్ బాక్సర్ లో కన్నడ విలక్షణ నటుడు?

వరుణ్ తేజ్ బాక్సర్ లో కన్నడ విలక్షణ నటుడు?

Upendra approached for Varun Tejs next
Upendra approached for Varun Tejs next

యంగ్ మెగా హీరో వరుణ్ తేజ్ కెరీర్ ప్రస్తుతం సాఫీగా సాగిపోతోంది. ఈ హీరో నటించిన రీసెంట్ 2 సినిమాలు మంచి హిట్స్ గా నిలిచాయి. అదే ఊపులో మరో సినిమా చేసేయకుండా వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో భిన్నమైన సినిమాను ఎంచుకున్నాడు. అలాగే ఏదో చేసేసాం అంటే చేసేసాం అన్నట్లుగా ఉండకూడదని ఈ చిత్రం కోసం మూడు నెలల పాటు కఠోర శిక్షణ కూడా తీసుకున్నాడు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ మొదలైంది. విశాఖపట్నంలో మొదటి షెడ్యూల్ మొదలవ్వగా రెండు రోజుల క్రితం అది పూర్తయింది. రెండవ షెడ్యూల్ హైదరాబాద్ లో ఏప్రిల్ నుండి మొదలవుతుందని సమాచారం. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్  మొత్తాన్ని కంప్లీట్ చేసేస్తారని వినికిడి. జులై 30కి ఎలాగైనా చిత్రాన్ని విడుదల చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు నిర్మాతలు.

అల్లు వెంకటేష్,  సిద్దు ముద్ద ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కిరణ్ కొర్రపాటి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. థమన్ సంగీత దర్శకుడు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఒక కీలక పాత్రకు కన్నడ స్టార్ హీరో  ఉపేంద్రను అనుకుంటున్నారట. లెంగ్త్ తక్కువైనా సరే ఆయన పాత్ర సినిమాలో కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన్ను టీమ్ సంప్రదించిందట.

- Advertisement -

అయితే ఉపేంద్ర సినిమాలను చాలా సెలెక్టివ్ గా ఎంపిక చేసుకుంటాడు. తెలుగులో సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత మరో సినిమాను ఓకే చేయలేదు. సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత చాలానే సినిమాలకు ఉపేంద్రను అనుకున్నారు కానీ ఆయన దేనికీ ఓకే చెప్పలేదు. మరి వరుణ్ తేజ్ సినిమాకైనా ఓకే చెబుతాడా లేదా అన్నది చూడాలి. ఒకవేళ ఉపేంద్ర చేస్తే కనుక ఈ చిత్రానికి వెయిట్ పెరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కు పోటీ పాత్రలో నవీన్ చంద్ర నటిస్తున్నాడు. అలాగే నదియా ఒక కీలక పాత్రలో కనిపించనుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All