Homeటాప్ స్టోరీస్మన తెలుగు బుట్టబొమ్మ – వర్ష బొల్లమ్మ

మన తెలుగు బుట్టబొమ్మ – వర్ష బొల్లమ్మ

మన తెలుగు బుట్టబొమ్మ – వర్ష బొల్లమ్మ
మన తెలుగు బుట్టబొమ్మ – వర్ష బొల్లమ్మ

దళపతి విజయ్ హీరోగా గత ఏడాది దీపావళికి వచ్చిన బిగిల్ (తెలుగు లో విజిల్) సినిమాలో పెళ్ళైన తర్వాత మళ్ళీ ఫుట్ బాల్ గేమ్ కి రీ ఎంట్రీ ఇచ్చి, కడుపులో బిడ్డను పెట్టుకుని, పెనాల్టీ కిక్ కొట్టి మ్యాచ్ ని గెలిపించిన గాయత్రి గుర్తుందా.? ఆ పాత్రలో మనల్ని ఎమోషనల్ గా ట్రావెల్ చేయించిన అమ్మాయి.. అచ్చ తెలుగు అమ్మాయి వర్ష బోల్లమ్మ. ఇప్పుడు వర్ష ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా వచ్చిన “చూసీ చూడంగానే” సినిమాతో మన ముందుకు వచ్చేసింది. అంతేకాకుండా తమిళ క్లాసిక్ మూవీ 96 లో కూడా ఒక మంచి క్యారెక్టర్ చేసింది. పలు మలయాళ సినిమాల్లో నటించింది. ఇక 96 తెలుగు రీమేక్ అయిన జాను సినిమాలో కూడా అదే పాత్ర పోషించింది వర్ష.

తాజాగా రిలీజ్ అయిన “చూసీ చూడంగానే” సినిమాలో ఆమె మ్యూజిక్ డైరెక్టర్ పాత్రలో వర్ష యాక్టింగ్ చాలా క్యూట్ గా ఉంది. ఇక దర్శకురాలు శేష సింధు గారు వర్షకు మరో మంచి క్యారెక్టర్ ఈ సినిమాలో డిజైన్ చేసారు. ప్రస్తుతం వర్ష కు మంచి ఆఫర్స్ వస్తున్నాయి. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా వస్తోన్న ఒక సినిమాలో వర్ష గుంటూరు అమ్మాయి గా ఒక మంచి రోల్ లో మన ముందుకు రాబోతోంది. ఇక తనకు అందంతో పాటు నటనకు ఆస్కారం ఉన్నపాత్రలు, ముఖ్యంగా డీ గ్లామర్ రోల్స్ ఇష్టం అని వర్ష చెప్తోంది. ఇక ఈ ఏడాది ఆమెకు మంచి సినిమాలు వచ్చి వర్ష మ్యాజిక్ క్రియేట్ చెయ్యాలని కోరుకుందాం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All