
`ఓకే ఓకే` చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని నవ్వించిన హీరో ఉదయనిధి స్టాలిన్. తమిళ చిత్ర పరిశ్రమలో మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మనవడిగా మంచి పేరు తెచ్చుకున్న ఉదయనిధి స్టాలిన్ హీరోగా మాత్రం ఆ స్థాయి గుర్తింపును పొందలేకపోయారు. గత కొంత కాలంగా తన ప్రభావాన్ని చూపించలేకపోతున్న ఆయన తాజాగా ఓ ఛాలెంజింగ్ సినిమాతో ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చారు.
ఉదయనిధి స్టాలిన్ నటించిన తమిళ చిత్రం `సైకో`. మిస్కిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో నిత్యామీనన్, అదితీరావు హైదరీ హీరోయిన్‌లుగా నటించారు. ఉదయనిధి స్టాలిన్ కళ్లులేని కండక్టర్‌గా ఛాలెంజింగ్ పాత్రలో నటించారు. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రాన్ని బలహీనంగా వున్న వాళ్లు, పిల్లలు, గర్భవతులు, హార్ట్ పేషెంట్స్ చూడొద్దని ఉదయనిధి స్టాలిన్ స్టేట్‌మెంట్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.
ఓ సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం చూసిన వారు ఖచ్చితంగా భయానికి గురవుతారని, వీక్ హార్ట్ వున్న వాళ్లు, ముఖ్యంగా పిల్లలు ఈ సినిమాకు దూరంగా వుండాలని ఓ పెన్‌గా చెప్పడంతో `సైకో` సినిమాపై సర్వత్రా ఆసక్తినెలకొంది. తమళంలో ఈ శుక్రవారం విడుదలైన ఈ చిత్రం త్వరలో తెలుగులోనూ రిలీజ్ కానుంది.