Homeగాసిప్స్మరింత దూకుడుగా అల వైకుంఠపురములో ప్రమోషన్స్

మరింత దూకుడుగా అల వైకుంఠపురములో ప్రమోషన్స్

మరింత దూకుడుగా అల వైకుంఠపురములో ప్రమోషన్స్
మరింత దూకుడుగా అల వైకుంఠపురములో ప్రమోషన్స్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న తాజా చిత్రం అల వైకుంఠపురములో కి సంబంధించి ప్రమోషన్స్ చాలా దూకుడుగా జరుగుతోన్న విషయం తెలిసిందే. సినిమా విడుదలకు దాదాపు నాలుగు నెలల ముందే ఈ సినిమా ప్రమోషన్స్ ను షురూ చేసారు అల వైకుంఠపురములో టీమ్. ఈ చిత్రంలోని తొలి పాట సామజవరగమన ను విడుదల చేసిన వెంటనే మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధిస్తూ ఈ పాట సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇది జరిగి నెల రోజులు కూడా తిరక్కముందే ఈ చిత్రంలోని రెండో పాట విడుదలై అంతే స్థాయి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. రాములో రాముల కూడా మొదటి పాట రేంజ్ లోనే హిట్ అవ్వడం విశేషం.

ఈ రెస్పాన్స్ తో అల వైకుంఠపురములో టీమ్ మరింత జోష్ తో ముందుకెళ్లబోతోంది. ఈ సినిమాలో మూడో పాట రిలీజ్ చేయగా అది కూడా అందరినీ ఆకట్టుకుంది. ఇక రీసెంట్ గా రిలీజైన అల వైకుంఠపురములో టీజర్ అయితే అంచనాలను తలకిందులు చేస్తూ సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ చిత్రంలోని నాలుగో పాట బుట్టబొమ్మను ఈ నెల 18న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెల్సిందే.

- Advertisement -

ఇవన్నీ కాకుండా అల వైకుంఠపురములో టీమ్ ఇప్పుడు ప్రమోషన్స్ ను మరింత దూకుడుగా ప్లాన్ చేసింది. సినిమా రిలీజ్ కు ఇంకా నెల రోజులు కూడా లేని పరిస్థితిలో ప్రమోషన్స్ ను ఎక్కడా తక్కువ చేయకూడదన్న ఉద్దేశంతో అల వైకుంఠపురములో టీమ్ ఉంది. అందుకే రిలీజ్ కు ముందు రెండు భారీ ఈవెంట్లను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఒకటి ఈ నెల 28న థమన్ సారధ్యంలో ఒక మ్యూజికల్ నైట్ ను నిర్వహించబోతున్నారు. ఇందులో థమన్ తన టీమ్ తో కలిసి అన్ని పాటలను లైవ్ లో పెర్ఫార్మ్ చేయనున్నాడట. ఇది ఏ వేదికపై జరుగుతుంది అన్నది త్వరలో అప్డేట్ అవుతుంది. ఇక జనవరి మొదటి వారంలో ఎలాగు ప్రీ రిలీజ్ ఈవెంట్ అతి భారీగా నిర్వహిస్తారు. ఈ రెండు ఈవెంట్స్ లో కూడా ఫ్యాన్స్ కు కొన్ని సరప్రైజ్ లు ఉంటాయని టీమ్ అనధికారికంగా వెల్లడిస్తోంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో పూజ హెగ్డే కథానాయికగా నటిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All