Homeగాసిప్స్రవిప్రకాష్ ని తొలగించిన టివి 9

రవిప్రకాష్ ని తొలగించిన టివి 9

టివి 9 సి ఈ ఓ గా అందరికీ సుపరిచితుడైన రవిప్రకాష్ కు కొత్తగా వచ్చిన మేనేజ్ మెంట్ కు అంతగా పొసగడం లేదు దాంతో రవిప్రకాష్ ని సి ఈ ఓ గా తొలగించారు . అంతేకాదు టివి 9 కు చెందిన ఆర్ధిక లావాదేవీలలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రవిప్రకాష్ కోసం గాలింపు చేపట్టారు పోలీసులు , దేశం విడిచి పారిపోకుండా రవిప్రకాష్ పాస్ పోర్ట్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు .

- Advertisement -

టివి 9 ప్రారంభం నుండి రవిప్రకాష్ కొనసాగుతున్నాడు . అయితే కొన్నాళ్లుగా ఈ ఛానల్ ని అమ్ముతున్నట్లు కథనాలు వచ్చాయి కానీ అమ్మకం కుదరలేదు కానీ గత ఏడాది మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు సన్నిహితుడైన రామేశ్వర్ రావు ఈ ఛానల్ ని కొన్నారు .ఇక అప్పటి నుండి రవిప్రకాష్ మధ్య కొత్త మేనేజ్ మెంట్ మధ్య విబేధాలు తలెత్తడంతో ఈరోజు ఏకంగా సి ఈ ఓ పోస్ట్ నుండి తొలగించారు . అలాగే పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు . రవిప్రకాష్ తో పాటుగా నటుడు శివాజీ పైన కూడా దర్యాప్తు చేస్తున్నారు తెలంగాణ పోలీసులు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All