Homeటాప్ స్టోరీస్కారు యాక్సిడెంట్ లో అరెస్ట్ అయిన నటుడు

కారు యాక్సిడెంట్ లో అరెస్ట్ అయిన నటుడు

tv actor siddharth shukla arrestedర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఓ మూడు కార్ల కు ఇబ్బంది సృష్టించిన బుల్లితెర నటుడు సిద్దార్థ్ శుక్లా ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు . సంచలనం సృష్టించిన ఈ సంఘటన నిన్న జరిగింది . బాలికా వధు అనే సంచలనం సృష్టించిన సీరియల్ లో నటించాడుఈ సిద్దార్హ్ శుక్ల . తెలుగులో చిన్నారి పెళ్లి కూతురు గా అనువాదం చేయగా ఇక్కడ కూడా చాలా పెద్ద హిట్ అయ్యింది ఆ సీరియల్ . ఇప్పటికి కూడా స్టార్ మా ఛానల్ తనకున్న పలు ఛానల్స్ లో ఈ చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ని ప్రసారం చేస్తూనే ఉన్నారు .

సంఘటన వివరాలలోకి వెళితే ……. సిద్దార్థ్ శుక్ల ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ అదుపు తప్పడంతో వరుసగా మూడు కార్లు దెబ్బతిన్నాయి , మూడు కార్లని డీ కొట్టినప్పటికీ అదుపులోకి రాకపోగా ఓ విద్యుత్ స్థంభం ని డీ కొట్టి ఆగింది . అయితే ఆ భారీ యాక్సిడెంట్ లో సిద్దార్థ్ శుక్ల కు స్వల్ప గాయాలు మాత్రమే కాగా మరో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి కి మాత్రం కాస్త ఎక్కువే గాయాలయ్యాయి . సిద్దార్థ్ శుక్ల మద్యం తాగి ర్యాష్ డ్రైవింగ్ చేశాడా ? లేక అదుపుతప్పి ఇలా జరిగిందా ? అన్న కోణం లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు . ప్రస్తుతం సిద్దార్థ్ శుక్ల పోలీసులు అదుపులో ఉన్నాడు . కార్లు మూడు కూడా బాగా దెబ్బతిన్నాయి .

- Advertisement -

English Title: tv actor siddharth shukla arrested

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All