Homeటాప్ స్టోరీస్దళారీలు ఎందుకు ? ఆ డబ్బులు మాకే ఇవ్వండి

దళారీలు ఎందుకు ? ఆ డబ్బులు మాకే ఇవ్వండి

దళారీలు ఎందుకు ? ఆ డబ్బులు మాకే ఇవ్వండి
దళారీలు ఎందుకు ? ఆ డబ్బులు మాకే ఇవ్వండి

కలియుగ వైకుంఠపురి ‘తిరుమల తిరుపతి దేవస్థానం’ లో కొత్త ప్రణాళికలు అమలు అవుతున్నాయి. సామాన్య మానవుడు కూడా ఇక మీదట వి.ఐ.పి అయిపోవచ్చు. కానీ డబ్బులు మాత్రం గట్టిగా సమర్పించుకోవాలి. ఒక్కో మనిషికి దాదాపు 10,000 వసూలు చేస్తారు. టి.టి.డి బోర్డు ఈప్రక్రియని తొందరలోనే అమలు చేయబోతుంది. ఒకవేళ మీ ఇంట్లో పది మంది ఉంటే తొంభై తొమ్మిది వేలు సమ్పరించుకోవాలి అని టీటీడీ బోర్డు చైర్మన్  వైవీ సుబ్బారెడ్డి గారు మీడియా పరంగా ప్రకటించారు.

వి.ఐ.పి దర్శనం అంటే స్వామి వారిని బ్రేక్ దర్శనం సమయంలో దగ్గరగా చూస్తూ ఉండొచ్చు, మనకి ఇంకొకలతో సంబంధం ఉండదు. ఆ వి.ఐ.పి దర్శనం ఎప్పుడు సినిమా, రాజకీయ ప్రముఖులకు మాత్రమే దక్కేది. మిగిలిన సామాన్య భక్తులు మాత్రం గంటలు గంటలు ఇంకా సమయం ఎక్కువైతే 2,3 రోజులు కూడా కంపార్ట్మెంట్ లో కూర్చునేవారు. ఓపిక ఎక్కువ లేని వారు కొంతమంది దళారీలని ఆశ్రయిచి వారికి అంతో ఇంతో డబ్బులు సమర్పించేవారు. ఆర్ధిక శక్తి ఉన్నవారికి మాత్రమే డబ్బులు చెల్లించే అవకాశం వీలు దొరికింది. కానీ ఎప్పుడో సంవత్సరానికి వచ్చే దూర ప్రాంతాల వారికి ఒక్కో మనిషికి పది వేల రూపాయలు అంటే వారి కుటుంబానికి ఆలోజింపచేసే జీవనోపాధి.

- Advertisement -

దళారీల వ్యవస్థని మట్టిపెట్టడానికి తీసుకున్న ఈ నిర్ణయం అలిపిరి మెట్ల ద్వారా నడిచి వచ్చే భక్తులకి మంచి సదుపాయాలు ఉన్న, దర్శనం తొందరగా అయ్యేలా చేస్తే అందులో 10000 మందికి ఉపయోగం ఉంటుంది. అవును చూసుకుంటే ఒకరోజుకి గరిష్టంగా తిరుపతి నుండి తిరుమలకి మెట్లు ఎక్కేవారి సంఖ్య క్రమక్రమంగా సగటుకి 10000 నుండి 15000 మంది జనాలు పెరుగుతూనే ఉంటారు. 100 లో 70 శాతం మంది స్వామి వారిని నిజంగా కొలిచే వారు సామాన్య ప్రజలు ఉన్న ఈ రోజుల్లో కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ నిధుల కోసం వారి హుండీలు నింపాలని ఇలా చేయడం ఒకింత మనుషులని కలిచివేస్తుంది.

రాత్రి సమయాల్లో అలిపిరి మెట్ల దారి మధ్యలో నడిచే వారికి, శ్రీ వారి మెట్ల దగ్గర భద్రతగా ఒక పోలీసు వారిని రక్షకులుగా ఉంచాలని ఎప్పటినుండో జనాలు టి.టి.డి వారికి విన్నవించుకున్నారు. అలాంటివి ప్రతి సామాన్యుడికి అవసరమయ్యే ప్రణాళికలు తీసుకుంటే మంచిది గాని ఇలాంటి బ్రేక్ దర్శనం, వి.ఐ.పి దర్శనం వలన ఆర్థిక శక్తి ఉన్న వారికి ఉపయోగపడుతుంది కానీ సామాన్య మనుషులకి ఏ మాత్రం ఉపయోగం లేని ప్రణాళిక ఇది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All