ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు టిఎసార్టీసీ ఎం.డి సజ్జనార్ నుండి షాక్ తగిలింది. అల్లు అర్జున్ ర్యాపిడో ఆన్ లైన్ బైక్ సర్వీస్ యాడ్ లో ఆర్టీసీని అవమానించే విధంగా ఉందని ఆర్టీసీ ఎండి సజ్జనార్ అల్లు అర్జున్ కు.. ర్యాపిడీ యాజమాన్యానికి లీగల్ నోటీసులు పంపించారు. హోటల్ లో దోశ వేస్తూ ఆర్టీసీ బస్సులో ప్రయాణం మాములు దోశగా ఉన్నది కాస్త అక్కడ జనాల ఒత్తిడికి మసాలా దోశ అవుతారని అంటాడు. ఎంచక్కా ర్యాపిడో బైక్ బుక్ చేసుకుని ప్రయాణాన్ని సౌకర్యవంతం చేసుకోండని అంటాడు.
అయితే ఈ యాడ్ పై టిఎస్ ఆర్టీసి ఎండి సజ్జనార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్టీసీని అవమన పరచేలా ఈ యాడ్ ఉందని. వెంటనే వారికి నోటీసులు పంపించారు. అయితే ర్యాపిడో టీం ఈ యాడ్ ను మార్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాదు వారి తనపున ఆర్టీసీకి రెస్పాన్స్ కూడా ఇవ్వాలని చూస్తున్నారు.
ర్యాపిడో యాడ్ ద్వారా అల్లు అర్జున్ కూడా ఈ వివాదంలో చిక్కుకున్నాడు. వారు ఇచ్చిన స్క్రిప్ట్ చదివినా సరే అల్లు అర్జున్ కూడా టీ.ఎస్ ఆర్టీసీ నుండి నోటీసులు అందుకోవాల్సి వచ్చింది.
