Homeటాప్ స్టోరీస్కేసీఆర్ ని ఓడగొట్టడానికి మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు

కేసీఆర్ ని ఓడగొట్టడానికి మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు

ts opposition parties unhappy with kcr govtతెలంగాణ లో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఒంటరిగా ఎదుర్కొంటే ఓడించడం కష్టమని భావిస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు . తెలంగాణ వచ్చిన తర్వాత గులాబీ దళం జెండా పాతగా అధికార పార్టీలోకి తమతమ అవసరాల కోసం తెలుగుదేశం పార్టీ నుండి అలాగే కాంగ్రెస్ పార్టీ నుండి పలువురు శాసన సభ్యులు చేరారు . అప్పుడే నాలుగేళ్ళ సమయం అయిపొయింది అయితే కేసీఆర్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ని సొమ్ము చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ , తెలుగుదేశం పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి కానీ తెలుగుదేశం పార్టీ శక్తి సరిపోవడం లేదు దానికి తోడు అంతో ఇంతో బలమైన నాయకుడైన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరడంతో ఆ పార్టీ మరింత డీలా పడింది .

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో మాదే అధికారం అంటూ బలంగా నమ్ముతున్నారు , కానీ ప్రజలను సమూహ పరచడంలో మాత్రం విఫలం అవుతున్నారు . ఇక బీజేపీ కూడా తెలంగాణలో కేసీఆర్ కు ప్రత్యర్థులం మేమె అంటూ ఊహా లోకాల్లో విహరిస్తున్నారు కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం కాంగ్రెస్ మాత్రమే బలంగా ఉంది అలాగే మొదటి నుండి కేసీఆర్ పై ఒంటి కాలుమీద లేస్తున్న వ్యక్తి ప్రొఫెసర్ కోదండరాం . ఆయన కూడా రాజకీయ పార్టీ ని పెట్టబోతున్నట్లు స్పష్టం చేసాడు . అయితే ఒంటరిగా వెళ్లి కేసీఆర్ మీద గెలవడం కష్టం కాబట్టి మహాకూటమి లాగా ఏర్పడి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని లోలోన పెద్ద పెద్ద ప్రయత్నాలు చేస్తున్నారట . మరి ఈ ప్లాన్ 2019 ఎన్నికల్లో వర్కౌట్ అవుతుందేమో ? లేదో చూడాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All