
మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి సంయుక్తంగా నటించిన ఆచార్య సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎప్పట్నించో ఊరిస్తున్న వస్తున్న సినిమా కావడం తో అంతటా ఆసక్తి పెరిగింది. సినిమా ఎలా ఉంది..చిరంజీవి – చరణ్ ల సీన్లు ఎలా ఉన్నాయి..అనేవి తెలుసుకోవాలని అభిమానులు , ప్రేక్షకులు సోషల్ మీడియా లో సెర్చ్ చేస్తున్నారు. అయితే ఇటీవల సోషల్ మీడియా వాడకం పెరగడం తో సినిమా రిలీజ్ రోజునే సినిమా తాలూకా హైలైట్స్ ను సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు. హైలైట్స్ తాలూకా వీడియోస్ షేర్ చేస్తూ వస్తున్నారు. అలాగే ట్రోల్స్ కూడా అదే రేంజ్ లో చేస్తున్నారు. ఇక ఆచార్య విషయంలోనూ అదే జరుగుతుంది.
‘ఆచార్య’ సినిమాలో చిరంజీవి నక్సలైట్ పాత్రను చేసిన విషయం తెలిసిందే. ఇందులో తన స్నేహితుడు (హీరో సత్యదేవ్) పోలీసుల కాల్పుల్లో చనిపోయే ముందు చంటిబిడ్డ సిద్ధను ఆచార్య చేతుల్లో పెడతాడు. ఇది ఫ్లాష్‌బ్యాక్ సీన్‌గా చూపించారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది.. కానీ, ఇందులో చిరంజీవిని గ్రాఫిక్స్‌తో స్లిమ్ అండ్ వింటేజ్ లుక్‌తో చూపించడం ట్రోల్స్ కు గురి చేస్తుంది. చిరంజీవిని అలా చూపించడంతో ‘ఆచార్య’ సినిమాలో సత్యదేవ్‌తో జరిగే సన్నివేశంలో చిరంజీవిని పాత కాలంలో ఉన్నట్లుగా చూపించడంతో దీనిపై ట్రోల్స్ వస్తున్నాయి. కొందరు నెటిజన్లు ఈ సీన్‌ను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ చిరంజీవి లుక్‌పై జోకులు వేస్తున్నారు. అదే సమయంలో దర్శకుడు కొరటాల శివపైనా విమర్శలు చేస్తున్నారు. ఈ సీన్ ను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవచ్చు అంటున్నారు.