Homeగాసిప్స్`అల వైకుంఠ‌పుర‌ములో`.. పాత్ర‌లే మారాయా?

`అల వైకుంఠ‌పుర‌ములో`.. పాత్ర‌లే మారాయా?

`అల వైకుంఠ‌పుర‌ములో`.. పాత్ర‌లే మారాయా?
`అల వైకుంఠ‌పుర‌ములో`.. పాత్ర‌లే మారాయా?

`రెండు ఎక‌రాల రైతు కూలోళ్ల‌ను పెట్టుకునే తాహ‌త లేక పెండ్లాన్ని తోలుకొని పొలం ప‌నుల‌కు పోయినాడు..వాని ఆరేండ్ల పాప ఇంటి కాడ‌నే వుంది..సంవ‌త్స‌రం కూడా లేని త‌మ్మున్ని స‌ముదాయిస్తావున్న‌ది..ఏడ్చినాడ‌ని ఎండ‌లో ఎత్తుకుని తిరిగిందేమో మాప‌టేల‌కు జ‌రం కాసింది. పార్టీలు కొట్లాట‌ల‌తో బాంబులేసుకునే ఊర్లాయే పొద్ద‌గూకినాక బ‌స్సులేడ తిరుగుతాయి బాల్‌రెడ్డీ.. ప‌ది మైళ్ల దూరం ధ‌ర్మాసుప‌త్రి. పిల్లనెత్తుక‌ని పోయేస‌రికి డాక్ట‌ర్ ఆల‌స్యం అయ్యింద‌న్నాడు..అమ్మ బోరు మంది.. ఇదే క‌థ తిర‌గ‌మ‌లిచి చెప్పేదా… `అర‌వింద స‌మేత‌..`లో న‌వీన్‌చంద్ర‌తో జ‌రిగే పీస్ మీటింట్ స‌మ‌యంలో ఎన్టీఆర్ ప‌లికిన‌ డైలాగ్ ఇది. ఇదే ఫార్ములాను త్రివిక్ర‌మ్ త‌న సినిమాలకు వాడుతున్న‌ట్టున్నాడు.

అత్త కోసం అల్లుడు అదే ఇంటికి ప‌నివాడుగా వెళ్ల‌డం, చివ‌రికి అత్త‌కు త‌న వాళ్లు ఎంత‌గా బాధ‌ప‌డుతున్నారో వివ‌రించి త‌న ఇంటికి తీసుకెళ్లం అనేది ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టించిన `అత్తారింటికి దారేది` క‌థా క‌మామీషు. స‌రిగ్గా ఇదే క‌థ‌ని తిర‌గ‌రాసి మ‌రో వెర్ష‌న్‌ని `అల వైకుంఠ‌పుములో` చూపిస్తున్న‌ట్టుగా అర్థ‌మ‌వుతోంది. అల్లు అర్జున్ న‌టిస్తున్న అల `వైకుంఠ‌పుర‌ములో` చిన్నత‌నంలో తండ్రి త‌న కొడుకుని వేరే వ్య‌క్తి ద‌గ్గ‌రుంచి పెంచ‌డం.. ఆ త‌రువాత త‌న క‌న్న‌తండ్రిని వెతుక్కుంటూ `అల వైకుంఠ‌పుర‌ము..కు రావ‌డం అన్న‌ది తాజాగా త్రివిక్ర‌మ్ వినిపిస్తున్న కొత్త క‌థ‌. క‌థ అదే త్రివిక్ర‌మ్ కొత్త‌గా పాత్ర‌ల్ని, వాటి తాలూకు భావోద్వేగాల్ని, సంద‌ర్భాల్ని మార్చేశాడంతే.

- Advertisement -

ఈ సినిమా క‌థ‌లో కొంత `అజ్ఞాత‌వాసి` ఛాయ‌లు కూడా క‌నిపిస్తున్నాయి. గాడి త‌ప్పిన ఇంటిని చ‌క్క‌దిద్ద‌డం కోసం త‌న ఆఫీసులోనే ప‌నోడిగా చేర‌డం, ఆ త‌రువాత ఆఫీస్‌ని, త‌ర్వాత ఇంటిని చ‌క్క‌దిద్ది తండ్రి కోరిక‌ని నెర‌వేర్చ‌డం.. ఆ క్ర‌మంలో వినోదాన్ని పండిస్తూనే త‌న‌దైన స్టైల్ మేన‌రిజ‌మ్స్‌తో అల్లు అర్జున్ మాస్ యాంగిల్‌ని చూపించ‌డం ఇందులో ప్ర‌ధాన అంశాలుగా క‌నిపిస్తున్నాయి. అయితే అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి చిత్రాల‌కు మించి పూర్తి స్థాయి వినోదాన్ని, యాక్ష‌న్‌ని స‌మ‌పాళ్ల‌లో త్రివిక్ర‌మ్ ఇందులో మిక్స్ చేసిన‌ట్టు క‌నిపిస్తోంది. అదే `అల వైకుంఠ‌పుర‌ములో`కు ప్ర‌ధాన ఎస్సెట్‌గా మారే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. అదే జ‌రిగితే సంక్రాంతి రేసులో `అల వైకుఠ‌పుములో.` బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన‌ట్టే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All