Homeటాప్ స్టోరీస్పార్టీకి పిలవడం మర్చిపోవద్దంటున్న త్రివిక్రమ్

పార్టీకి పిలవడం మర్చిపోవద్దంటున్న త్రివిక్రమ్

పార్టీకి పిలవడం మర్చిపోవద్దంటున్న త్రివిక్రమ్
పార్టీకి పిలవడం మర్చిపోవద్దంటున్న త్రివిక్రమ్

అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హవా ఇప్పుడు మాములుగా లేదు. ఏం చెప్పినా జనాలు ఎగబడి వింటున్నారు. అల వైకుంఠపురములో సినిమా సూపర్ హిట్ తో త్రివిక్రమ్ మళ్ళీ మరోసారి తన స్టామినాను చాటి చెప్పాడు. అలాంటి దర్శకుడు భీష్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి తాను సినిమా చూశానని అదిరిపోయిందని చెప్తే దాని బజ్ ఏ రేంజ్ లో ఉంటుంది? భీష్మ యూనిట్ సభ్యులు కూడా ఇప్పుడు అదే ఆనందానికి గురవుతున్నారు. భీష్మ సినిమా గురించి చాలా మాట్లాడాడు త్రివిక్రమ్.

సాధారణంగా ఎవరైనా ఏదైనా ఈవెంట్ లో తాను సినిమా చూసా, అదిరిపోయింది, అభిమానులకు పండగే అని మొక్కుబడిగా మాట్లాడేస్తారు కానీ త్రివిక్రమ్ సినిమాలోని హైలైట్స్ గురించి కూడా చెప్పడం విశేషం. భీష్మ సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే ఫైట్ గురించి చాలా స్పెషల్ గా మాట్లాడాడు త్రివిక్రమ్. వెంకీ కుడుముల ఆ ఫైట్ ను చాలా పొయిటిగ్గా చిత్రీకరించారని వెల్లడించాడు. అల వైకుంఠపురములో చిత్రానికి ఆఖర్లో వచ్చే సిత్తరాల సిరపడు సాంగ్ ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగా ఫైట్ కాకుండా పాటతో పాటు దానికి తగ్గట్లుగా ఫైట్ పెట్టడంతో భలేగా వర్కౌట్ అయింది. ఇప్పుడు అదే తరహాలో భీష్మ సినిమాలో ఫైట్ ఉంటుందని చెబుతున్నారు. స్పెషల్ గా దాని గురించే మాట్లాడాడు అంటే అందులో నిజంగానే ఏదో స్పెషలిటీ ఉండి ఉండాలి.

- Advertisement -

ఫైట్ తో పాటు మహతి సాగర్ అందించిన సంగీతం కూడా వన్ ఆఫ్ ది హైలైట్స్ అని చెప్పడం విశేషం. ఇక ఫైట్ మాస్టర్స్ గురించి హీరోయిన్ రష్మిక గురించి కూడా మాట్లాడాడు త్రివిక్రమ్. స్పీచ్ ఆఖర్లో సినిమా రిలీజయ్యాక భీష్మ యూనిట్ అంతా సక్సెస్ సెలబ్రేషన్స్ లో బిజీగా ఉంటారని, అయితే ఆ వేడుకలకు నన్ను పిలవడం మర్చిపోవద్దని చెప్పడం కొసమెరుపు. అసలే పాజిటివ్ టాక్ ఈ చిత్రానికి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు కొండంత బలాన్ని ఇస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All