Homeగాసిప్స్ఒక సంక్రాంతి ఇద్దరికి పరీక్ష..

ఒక సంక్రాంతి ఇద్దరికి పరీక్ష..

Trivikram Srinivas And Allu Arjun
ఒక సంక్రాంతి ఇద్దరికి పరీక్ష..

గత సంవత్సరం జనవరి నెలలో విడుదల అయిన “అజ్ఞాతవాసి” సినిమా.. పవన్ కళ్యాణ్ గారికంటే ఎక్కువగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి మీద బాగా ప్రబావం చూపించింది. కారణం సినిమా ఫ్లాప్ అవ్వడం, పవన్ కళ్యాణ్ ఆ సినిమా తర్వాత సినిమాలు చెయ్యడం లేదు అని చెప్పడం. అప్పటివరకు త్రివిక్రమ్ గారు మా హీరోకి కచ్చితంగా హిట్ ఇస్తారు అని పిచ్చిగా పవన్ అభిమానులు నమ్మటం, అలా నమ్మినందుకు సినిమా ఫ్లాప్ అవ్వడం.

ఇలా అన్ని కలిసి త్రివిక్రమ్ గారి మీద ప్రభావం చూపియ్యటం, త్రివిక్రమ్ గారికి సంక్రాంతి సెంటిమెంట్ బయపడేలా చేసింది. అయితే తరువాత వచ్చిన “అరవింద సమేత వీర రాఘవ” సినిమాతో త్రివిక్రమ్ గారు మళ్ళీ ఫాం లోకి వచ్చారు అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు “అల్లు అర్జున్” తో చేస్తున్న “అల వైకుంఠపురము లో” సినిమా కూడా మళ్ళీ సంక్రాంతికి విడుదల అవుతుంది.

- Advertisement -

అల్లు అర్జున్ గారేమో ఒక పక్క “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” సినిమాతో గోరంగా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నారు, పైగా సినిమాల విషయంలో ఏడాదిన్నర గ్యాప్ కూడా ఇచ్చారు. ఇప్పుడు త్రివిక్రమ్ గారితో చేస్తున్న కొత్త సినిమా సంక్రాంతికి విడుదల అని తెలిసి బన్నీ ఫాన్స్ తెగ కంగారుపడుతున్నారు.. పవన్ అభిమానులకి ఇచ్చినట్లు మాకు కూడా సంక్రాంతికి బన్నీ తో సినిమా ఫ్లాప్ ఇస్తారా? అని.

నిజానికి దాంట్లో కూడా చాల అర్ధం ఉంది. సంక్రాంతికి ఇదొక్క సినిమాయే కాదు, మహేష్ బాబు, కళ్యాణ్ రామ్ సినిమాలు పోటిలో ఉన్నాయి, బన్నీ సినిమా పర్వాలేదు అనిపించుకోవద్దు, అలా ఉంటే సినిమా ఫ్లాప్ అవ్వడం పక్క. మా సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి అని బన్నీ ఫాన్స్ వేడుకుంటున్నారు. మరి వీళ్ళ లాగానే మిగిలిన హీరోల అభిమానులు కూడా అలానే అనుకుంటారు కదా. మొతానికి బన్నీ కి, త్రివిక్రమ్ గారికి సంక్రాంతి పెద్ద పరిక్ష అని అంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All