
పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్ ప్రాణ స్నేహితులు అని చెప్పాల్సిన పనిలేదు. వీరి కలయికలో రీసెంట్ గా భీమ్లా నాయక్ మూవీ వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలో మరోసారి వీరిద్దరి కలయికలో మరో రీమేక్ తెరకెక్కబోతుందనే వార్తలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతూ వస్తున్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ , జీ స్టూడియోస్ సంయుక్తంగా తమిళ చిత్రం ‘వినోదాయ సితం’ చిత్రాన్ని తెలుగు లో పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేయబోతున్నారని , దీనికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే , మాటలు అందించబోతున్నట్లు వార్తలు వినిపిస్తూ వచ్చాయి. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ ఈ సినిమా నుండి తప్పుకున్నాడనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఆయనకు పవన్ అప్పగించిన బాధ్యతల్ని మరో రచయితకు అప్పగించాలనే ఆలోచనలో త్రివిక్రమ్ వున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సడెన్ గా త్రివిక్రమ్ తప్పుకోవాలని నిర్ణయం వెనుక మహేష్ బాబు చిత్రమే అంటున్నారు. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీని త్వరగా సెట్స్ పైకి తీసుకెళ్లాలనే ఉద్దేశ్యం తో పవన్ సినిమా నుండి త్రివిక్రమ్ తప్పుకున్నాడని అంటున్నారు. మరి నిజంగా తప్పకుండా..లేదా అనేది తెలియాల్సి ఉంది.