Homeటాప్ స్టోరీస్మళ్ళీ లైమ్ లైట్లో త్రిష - క్రేజీ ప్రాజెక్ట్స్

మళ్ళీ లైమ్ లైట్లో త్రిష – క్రేజీ ప్రాజెక్ట్స్

మళ్ళీ లైమ్ లైట్లో త్రిష - క్రేజీ ప్రాజెక్ట్స్
మళ్ళీ లైమ్ లైట్లో త్రిష – క్రేజీ ప్రాజెక్ట్స్

దశాబ్దన్నర దాటినా త్రిష ఇంకా క్రేజీ ప్రాజెక్ట్స్ దక్కించుకుంటూ కెరీర్ ను ముందుకు తీసుకెళ్తోంది. ముఖ్యంగా తమిళంలో చేసిన 96 చిత్రం ఆమెకు ఆమె కెరీర్ కు మంచి బూస్టప్ అనే చెప్పాలి. దీని తర్వాత మళ్ళీ త్రిషకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం మణిరత్నం తెరకెక్కించనున్న పొన్నియన్ సెల్వన్ చిత్రంలో త్రిష కీలక పాత్ర పోషిస్తోంది.

దాంతో పాటు మలయాళంలో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కనున్న చిత్రంలో కూడా త్రిష నటిస్తోంది. ఇక తెలుగులో చిరంజీవి 152వ చిత్రంగా కొరటాల శివ దర్శకత్వంలో త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న చిత్రానికి కూడా త్రిషనే కథానాయికగా తీసుకోవాలని భావిస్తున్నారు.

- Advertisement -

ఇలా మూడు భాషల్లో మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ ను సొంతం చేసుకుంది త్రిష. ఇవి కనుక హిట్టయితే ఇక త్రిష కెరీర్ మళ్ళీ ఊపందుకుని సీనియర్ హీరోలకు ఫస్ట్ ఛాయస్ గా మారుతుందని వేరే చెప్పాలా!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All