
త్రిదా చౌదరి..ఈ భామ పేరు నార్త్ ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. తెలుగు లోను పలు సినిమాల్లో నటించింది ఈ భామ. ఏడేళ్ల కింద నిఖిల్ హీరోగా నటించిన సూర్య వర్సెస్ సూర్యతో ఇండస్ట్రీకి పరిచమైంది. దానికి ముందే హిందీలో హాట్ హాట్ వెబ్ సిరీస్‌లలో నటించింది. సూర్య వర్సెస్ సూర్య ఫ్లాప్ తర్వాత అమ్మడికి తెలుగు లో ఛాన్సులు రాలేకపోయాయి. కాస్త గ్యాప్ తర్వాత మహేష్ బాబు అక్క మంజుల తెరకెక్కించిన మనసుకు నచ్చింది మూవీ తో మరోసారి ప్రేక్షకులను పలకరించింది. కానీ ఈ సినిమా కూడా ప్లాప్ కావడం తో మరో ఛాన్స్ రాకుండా పోయింది.
ప్రస్తుతం ఈ భామ ఫోకస్ అంత కూడా నార్త్ పైనే పెట్టింది. అలాగే సోషల్ మీడియా లో అందాల ఆరబోత చేస్తూ ఇంకా ఏమైనా ఛాన్సులు వస్తాయేమో అని ఎదురుచూస్తుంది. ఇక బీచ్ లో అయితే అమ్మడు అసలు బట్టలేసుకోవడమే చిరాకు అన్నట్లుగా బికినీతో అందర్నీ బుట్టలో వేసుకుంటుంది. తాజాగా ఈ బికినీ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఇవి చూసైనా ఎవరైనా ఛాన్స్ ఇస్తే బాగుండని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.