
గత కొద్దీ రోజులుగా సినీ స్టార్స్ కార్లకు వరుసగా ఫైన్లు విధిస్తున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. వాహనాలపై ఉన్న స్టిక్కర్లను తొలగించడం నుంచి మొదలైన వ్యవహరం ప్రస్తుతం కార్ల బ్లాక్ ఫిలింలను తొలగించే వరకు చేరింది. ఇక సెలబ్రిటీలు, సామాన్యులు అనే తేడా లేకుండా అందరిపై ట్రాఫిక్ పోలీసులు జరిమాన విధిస్తున్నారు. రీసెంట్ గా ఎన్టీఆర్ , అల్లు అర్జున్ , కళ్యాణ్ రామ్ కార్లకు ఫైన్ లు వేయగా..ఈరోజు మంచు మనోజ్ కారుకు ఫైన్ వేశారు.
పోలీసులు రెగ్యులర్ చెకప్‌లో భాగంగా బుధవారం టోలిచౌకిలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అటుగా వెళుతోన్న మంచు మనోజ్ కారును పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో మనోజ్ స్వయంగా కారు నడుపుతున్నారు. దీంతో కారు అద్దాలకు బ్లాక్ ఫిలింను గుర్తించిన పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందుకు గాను రూ. 700 చలాన్ విధించారు. అంతేకాకుండా అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలింను తొలగించారు.