Homeగాసిప్స్జబర్దస్త్ షో కు గడ్డుకాలం మొదలైందా?

జబర్దస్త్ షో కు గడ్డుకాలం మొదలైందా?

జబర్దస్త్ షో కు గడ్డుకాలం మొదలైందా?
జబర్దస్త్ షో కు గడ్డుకాలం మొదలైందా?

తెలుగు టెలివిజన్ చరిత్రలో అత్యంత సక్సెస్ అయిన షో గా జబర్దస్త్ గురించి చెప్పవచ్చు. ముందు నెమ్మదిగా ఆరు టీమ్ లీడర్లు, ఇద్దరు జడ్జ్ లు, ఒక యాంకర్ తో మొదలైన ఈ షో, సరికొత్త టీఆర్పీలను నమోదు చేసింది. ఒక కామెడీ షో కు ఈ స్థాయి టిఆర్పిలు కూడా ఊహించవచ్చా అన్న రేంజ్ లో అవి నమోదయ్యాయి. వారంలో ఒక్కరోజు మాత్రమే వచ్చే ఈ షో క్రమంగా వారంలో రెండు రోజులకు మారింది. టీమ్ లీడర్లు పెరిగారు, మరో యాంకర్ వచ్చి చేరింది. అయినా ఈ షో ఇంకా పెరిగిందే తప్ప తగ్గలేదు. టీఆర్పీలలో రికార్డుల మీద రికార్డులు సృష్టించింది. తన రికార్డులను తనే బద్దలుకొట్టుకుంది. మధ్యలో ఈ షో వివాదాస్పదమైంది కూడా. డబల్ మీనింగ్ డైలాగులు ఎక్కువయ్యాయంటూ కొంతమంది విమర్శలు చేసారు. నిజంగానే ఎక్కువయ్యాయి కూడా. కానీ ఒక్కసారి ప్రేక్షకాదరణ పొందాక అంత సులువుగా జనాలు షో ను విడిచి పెట్టలేరు. ఇప్పటికీ జబర్దస్త్ ను కొట్టే షో మరొకటి తెలుగు టివి చరిత్రలో రాలేదంటే అతిశయోక్తి కాదు.

ఈ షో ను కొట్టడానికి ప్రత్యర్థి టివి ఛానల్స్ వాళ్ళు ఎన్ని షోస్ రూపొందించినా కూడా జబర్దస్త్ రేంజ్ లో సక్సెస్ కాలేకపోయాయి. స్టార్ మా లో ఆ మధ్య దేశముదుర్లు అంటూ దాదాపు జబర్దస్త్ కాన్సెప్ట్ తోనే ఒక షో ను రూపొందించారు. ఎంత వేగంగా అయితే షో మొదలైందో అంతే వేగంగా షెడ్ కెళ్ళిపోయింది. జనాలు జబర్దస్త్ కు అలవాటు పడడంతో వేరే షోస్ వైపు చూడలేకపోతున్నారు. అంతెందుకు మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళే జబర్దస్త్ కాకుండా మరిన్ని ప్రోగ్రామ్స్ కు రూపకల్పన చేసారు. కానీ ఏదీ కూడా జబర్దస్త్ రేంజ్ లో సక్సెస్ కాలేకపోయింది. జబర్దస్త్ కు టివి నుండే కాకుండా యూట్యూబ్ నుండి కూడా భారీ ఆదాయం వస్తుంది. ముఖ్యంగా హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర మొదలగు వారి ప్రతి స్కిట్ కు మిలియన్స్ లో వ్యూస్ వస్తుంటాయి.

- Advertisement -

అయితే ఇన్నేళ్ళుగా ఇంత విజయవంతంగా రన్ అవుతున్న ఈ షో కు గడ్డు కాలం మొదలైందంటూ ప్రచారం ఊపందుకుంది. దానికి తగ్గట్లుగానే జబర్దస్త్ ను నడిపిస్తున్న ఇద్దరు డైరెక్టర్లు మల్లెమాలతో విబేధాల కారణంగా బయటకు వచ్చేసారు. ఇప్పుడు వారు వేరే టివి ఛానల్ లో జబర్దస్త్ వంటి షో కే కొన్ని మార్పులు చేసి రూపొందిస్తున్నారని తెలుస్తోంది. హోస్ట్ గా నాగబాబును ఈ షో లోకి లాగేసుకుంటున్నారని అంటున్నారు. అంతేకాకుండా హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర వంటి ఫేమ్ ఉన్న టీమ్ లీడర్లను కూడా ఈ షో లోకి తీసుకుంటున్నారట. దాదాపు డబల్ రెమ్యునరేషన్ ఇచ్చి వాళ్ళను తీసుకుంటున్నారట. జబర్దస్త్ షో కు అత్యంత ముఖ్యులు అయిన వీళ్ళు వెళ్ళిపోతే ఇక ఆ షో కు పూర్వ వైభవం ఉంటుందా లేదా అన్నది చూడాలి. అసలు ఇంతకీ ఈ వార్తల్లో నిజమెంతో!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All