Homeటాప్ స్టోరీస్ఆ రీమేక్ కోసం ఇద్దరు హీరోలు పోటీ

ఆ రీమేక్ కోసం ఇద్దరు హీరోలు పోటీ

top stars akshay kumar and ranvir singh eyes on kathhi remakeతమిళనాట సంచలన విజయం సాధించిన ” కత్తి ” చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి తన రీ ఎంట్రీ గా ” ఖైదీ నెంబర్ 150 ” పేరుతో రీమేక్ చేయగా తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే . కాగా ఇప్పుడు ఆ తమిళ కత్తి రీమేక్ రైట్స్ ని బాలీవుడ్ దిగ్గజం సంజయ్ లీలా భన్సాలీ ఫ్యాన్సీ ఆఫర్ తో దక్కించుకున్నాడు . సంజయ్ లీలా భన్సాలీ కత్తి రీమేక్ హక్కులు తీసుకోవడంతో ఆ సినిమాలో ఎవరు హీరోగా నటిస్తారో అన్న ఆసక్తి నెలకొంది ఎందుకంటే ఈ సినిమా కోసం ఇద్దరు హీరోలు పోటీ పడుతున్నారు . ఆ పోటీదారులలో ఒకరు అక్షయ్ కుమార్ కాగా రెండో హీరో రణ్ వీర్ సింగ్ .

అక్షయ్ తో అలాగే రణ్ వీర్ తో సినిమాలు చేసాడు సంజయ్ లీలా భన్సాలీ దాంతో ఈ ఇద్దరిలో కత్తి ఎవరి సొంతం అవుతుందని చర్చ జరుగుతోంది . అక్షయ్ కుమార్ వైపే మొగ్గు ఎక్కువగా కనబడుతోంది . ఒకవైపు రణ్ వీర్ సింగ్ దీపికా పదుకోన్ తో పెళ్ళికి రెడీ అవుతున్నాడు కాబట్టి అక్షయ్ నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వినిపిస్తోంది . ఇక సంజయ్ మాత్రం స్క్రిప్ట్ లో పలు మార్పులు చేశాకే హీరో ఎవరన్నది డిసైడ్ చేయాలనీ అనుకుంటున్నాడట .

- Advertisement -

English Title: top stars akshay kumar and ranvir singh eyes on kathhi remake

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All