Homeటాప్ స్టోరీస్టాలీవుడ్ టాప్ ఫైవ్ మూవీస్ ఇవే

టాలీవుడ్ టాప్ ఫైవ్ మూవీస్ ఇవే

tollywood top five movies list టాలీవుడ్ లో వంద కోట్ల సినిమా అంటే కామన్ అయిపొయింది . అగ్ర హీరోల సినిమాలు వంద కోట్ల గ్రాస్ వసూళ్ల ని అందుకుంటున్నాయి . అయితే ఎప్పటికప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ రికార్డులు చెరిగిపోతూనే ఉన్నాయి . ఒక హీరో కొత్త రికార్డ్ సృష్టించడం దాన్ని మరో హీరో బద్దలు కొట్టడం కామన్ అయిపొయింది టాలీవుడ్ లో . ముఖ్యంగా బాహుబలి సినిమా రాకతో తెలుగు సినిమా స్టామినా అమాంతం పెరిగిపోయింది దాంతో సరికొత్త రికార్డులు టాలీవుడ్ పేరిట ఉన్నాయి . పైగా ఓవర్ సీస్ మార్కెట్ కూడా తెలుగు సినిమాలకు బాగా కలిసి వస్తోంది దాంతో భారీ వసూళ్లు సాధిస్తున్నాయి తెలుగు చిత్రాలు .

టాలీవుడ్ లో ఎప్పటికప్పుడు రికార్డులు బద్దలు అవుతున్నప్పటికీ కొన్ని చిత్రాలు మాత్రం అందనంత ఎత్తులో ఉన్నాయి . ముఖ్యంగా బాహుబలి ఇప్పట్లో ఏ హీరో కూడా అందుకోలేంత ఎత్తులో ఉంది . బాహుబలి మొదటి భాగం 189 కోట్ల షేర్ సాధించగా రెండో భాగం ఏకంగా 309 కోట్లతో అగ్రస్థానంలో నిలిచింది . అలాగే చరణ్ నటించిన రంగస్థలం 125 కోట్ల షేర్ తో మూడో స్థానం లో నిలవగా మహేష్ నటించిన భరత్ అనే నేను 105 కోట్లతో నాల్గవ స్థానం , చిరంజీవి 150 వ చిత్రం ఖైదీ నెంబర్ 150 చిత్రం 102 కోట్ల షేర్ తో అయిదవ స్థానంలో నిలిచింది .

- Advertisement -

టాలీవుడ్ టాప్ ఫైవ్ సినిమాలు ఇవే

1) బాహుబలి 2 – 309 కోట్లు షేర్ వరల్డ్ వైడ్ తెలుగు వెర్షన్ కు
2) బాహుబలి 1 – 189 కోట్లు షేర్
3) రంగస్థలం – 125 కోట్ల షేర్
4) భరత్ అనే నేను – 105 కోట్ల షేర్
5) ఖైదీ నెంబర్ 150 -102 కోట్లు షేర్

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All