Homeటాప్ స్టోరీస్2018 లో వంద కోట్ల క్లబ్ లో చేరిన సినిమాలు

2018 లో వంద కోట్ల క్లబ్ లో చేరిన సినిమాలు

Tollywood Rs 100 Cr Club 2018 movies2018 లో ఇప్పటివరకు వందకోట్ల క్లబ్ లో చేరిన తెలుగు సినిమాలు మూడు ఉన్నాయి కాగా బాలీవుడ్ లో మాత్రం 9 నెలల్లో 9 సినిమాలు వంద కోట్ల క్లబ్ లో చేరాయి . బాలీవుడ్ లో ఈ ఏడాది ఇప్పటివరకు వంద కోట్ల కు పైగా వసూళ్లు సాధించిన చిత్రాల్లో తొమ్మిది చిత్రాలు ఉన్నప్పటికీ బాలీవుడ్ కి గ్లోబల్ మార్కెట్ ఉండటం వల్ల ప్లాప్ చిత్రాలు సైతం స్టార్ డం వల్ల వంద కోట్ల క్లబ్ లో చేరుతున్నాయి కానీ టాలీవుడ్ పరిస్థితి అలా కాదు బాలీవుడ్ చిత్రాలకున్న అడ్వాంటేజ్ ఉండదు , అలా ఉండకపోయినా టాలీవుడ్ సంచలనాలు సృష్టిస్తూనే ఉంది . టాలీవుడ్ లో ఈ ఏడాది వంద కోట్ల క్లబ్ లో చేరిన చిత్రాలు రంగస్థలం , భరత్ అనే నేను , గీత గోవిందం చిత్రాలు మాత్రమే !

రంగస్థలం :

- Advertisement -

1980 నాటి కథతో తెరకెక్కిన గ్రామీణ నేపథ్య చిత్రం . మట్టిమనుషుల కథ ఎలా ఉంటుందో చక్కగా చూపించాడు దర్శకుడు సుకుమార్ . మార్చి 30 న వరల్డ్ వైడ్ గా విడుదలైన రంగస్థలం చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 213 కోట్ల గ్రాస్ వసూళ్లని , 125 కోట్ల షేర్ ని సాధించి ప్రభంజనం సృష్టించాడు చిట్టిబాబు అలియాస్ చరణ్ .

భరత్ అనే నేను :

మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటించిన భరత్ అనే నేను చిత్రం రాజకీయ నేపథ్యంలో తెరకెక్కింది . ఏప్రిల్ 20న విడుదలైన ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించగా 187 కోట్ల గ్రాస్ వసూళ్లని 107 కోట్ల షేర్ ని సాధించింది . ప్లాప్ లతో సతమతం అవుతున్న మహేష్ ని మళ్ళీ హిట్ బాట పట్టేలా చేసింది .

గీత గోవిందం :

చిన్న చిత్రంగా రిలీజ్ అయిన గీత గోవిందం రికార్డుల వేట కొనసాగిస్తూ ప్రభంజనం సృష్టిస్తూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది . ఇప్పటివరకు 120 కోట్ల గ్రాస్ వసూళ్ళని 67 కోట్ల షేర్ ని సాధించిన గీత గోవిందం ఇంకా మంచి వసూళ్లతో నడుస్తోంది . విజయ్ దేవరకొండని స్టార్ హీరోగా నిలబెట్టిన చిత్రంగా నిలిచింది గీత గోవిందం . పరశురామ్ దర్శకత్వంలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్న నటించింది .

English Title: Tollywood Rs 100 Cr Club 2018 movies

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All