Homeటాప్ స్టోరీస్గుండెపోటు తో మరణించిన నిర్మాత

గుండెపోటు తో మరణించిన నిర్మాత

tollywood producer k raghava passes awayఈరోజు తెల్లవారుఝామున గుండెపోటు తో మరణించాడు ప్రముఖ నిర్మాత కే . రాఘవ (105 ) . దాసరి నారాయణరావు వంటి దర్శక దిగ్గజాన్ని పరిచయం చేసింది ఈ రాఘవ కావడం గమనార్హం . నిర్మాతకు అసలైన గుర్తింపు , గౌరవం ఉన్న రోజుల్లో పలు సంచలనాత్మక చిత్రాలను నిర్మించాడు రాఘవ . మరో విశేషం ఏంటంటే 105 ఏళ్ల పాటు బ్రతకడం రాఘవ జీవన శైలి ని , దేహ దారుఢ్యాన్ని సూచిస్తోంది . తెలుగులో పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన రాఘవ దాసరి నారాయణరావు తో పాటుగా కోడిరామకృష్ణ , సుమన్ , భానుచందర్ ,గొల్లపూడి మారుతీరావు , గాయకుడు ఎస్పీ బాలు లను పరిచయం చేసిన ఘనత కూడా రాఘవది కావడం విశేషం .

తూర్పు గోదావరి జిల్లా కోటిపల్లి గ్రామం కు చెందిన రాఘవ 1913 డిసెంబర్ 9న జన్మించాడు అంటే ఇప్పటికి 105 సంవత్సరాలు అన్నమాట ! ప్రేక్షకుల రివార్డులను , ప్రభుత్వ అవార్డులను సొంతం చేసుకున్న రాఘవ మృతి తో తెలుగు సినిమారంగంలో విషాద ఛాయలు నెలకొన్నాయి . కాగా రాఘవ అంత్యక్రియలు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు . రాఘవ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు .

- Advertisement -

English Title: tollywood producer k raghava passes away

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All