
ఈరోజు గురువారం తిరుమల శ్రీవారిని సినీ ప్రముఖులు పెద్ద సంఖ్య లో దర్శించుకున్నారు. నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్, దర్శకేండ్రుడు కె. రాఘవేంద్రరావు, నిర్మాత – నటుడు బండ్ల గణేష్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ మొదలగువారు శ్రీవారిని దర్శించుకున్నారు.
శ్రీవారి దర్శనార్ధం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలకగా, ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇక వీరి సినిమాల విషయానికి వస్తే..రాజేంద్రప్రసాద్ పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ గా ఉండగా..బండ్ల గణేష్ హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
- Advertisement -