Homeటాప్ స్టోరీస్టిక్ టాక్ లో టాప్ “బ్యాడ్ బాయ్” బేబీ

టిక్ టాక్ లో టాప్ “బ్యాడ్ బాయ్” బేబీ

టిక్ టాక్ లో టాప్ “బ్యాడ్ బాయ్” బేబీ
టిక్ టాక్ లో టాప్ “బ్యాడ్ బాయ్” బేబీ

గతంలోనే టిక్ టాక్ అనే యాప్ వల్ల సమాజం ఎంత గొప్పగా మారిందో చెప్పుకున్నాం కదా.! మామూలు మనుషులతో మొదలుపెట్టి సినిమా నటీనటుల వరకూ టిక్ టాక్ వీడియో లు చేసి రిలీజ్ చేస్తున్నారు. ఎదో ఒకటి చేసి కోటీశ్వరులు అయిపోవాలనుకునే వాళ్ళు ఎలాగైతే మారరో, అలాగే ఎదో ఒకటి చేసి జనాలలో ఫేమస్ అయిపోవాలనుకునే జనాలు మన చుట్టూ ఇంతమంది ఉన్నారా.? అనే విషయం టిక్ – టాక్ లాంటి అప్లికేషన్ ల వల్లె తెలుస్తోంది.

తాజాగా టిక్ టాక్ రివైండ్ 2019 లో భాగంగా ఇండియా మొత్తం మీద ఉండే వాటిలో నుండి ఒక 50 వీడియోలను రిలీజ్ చేసారు. వాటిలో బాలీవుడ్ హీరోయిన్, శ్రీలంక సుందరి జాక్వేలిన్ ఫెర్నాండజ్ అగ్రస్థానంలో నిలిచింది. ఆమె తన సినిమాల గురించిన అప్ డేట్స్ తోపాటు ఇంకా ఎన్నో రకాలైన కంటెంట్ వీడియోలు టిక్ టాక్ లో రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇక అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ లలో జాక్వేలిన్ కి మంచి క్రేజ్ ఉంది. ఇక తెలుగులో కూడా ప్రభాస్ సాహో సినిమా తరువాత ఆమెకు ఫాలోయింగ్ మొదలైంది. ఇక బాలీవుడ్ లో అయితే బీట్ పే బూటీ పాట నుండే ఆమె కు కల్ట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇక జాక్వేలిన్ తరువాతి స్థానాలలో రిచ్ కిడ్ & యాక్టర్ రితేష్ దేశ్ ముఖ్, బాలీవుడ్ కామెడీ స్టార్ కపిల్ శర్మ, మాధురీ దీక్షిత్ ఉన్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All