Homeటాప్ స్టోరీస్వంద కోట్ల దిశగా భాగీ 2

వంద కోట్ల దిశగా భాగీ 2

tiger shroff bhaaghi 2 towards 100 crore clubటైగర్ ష్రాఫ్ – దిశా పటాని జంటగా నటించిన ” భాగీ 2” మార్చి 30న విడుదలై సంచలనం సృష్టించింది . మొదటి రోజునే 25 కోట్లు కలెక్ట్ చేసి ట్రేడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది . అగ్ర హీరోలకు మాత్రమే సాధ్యమయ్యే ఈ ఫీట్ ని సాధించాడు టైగర్ ష్రాఫ్ . భాగీ చిత్రం సూపర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్ అంటూ భాగీ 2 ని రూపొందించారు . అయితే భాగీ చిత్రానికి భాగీ 2 చిత్రానికి పొంతనే లేదు ఎందుకంటే భాగీ తెలుగులో సూపర్ హిట్ అయిన వర్షం చిత్రానికి రీమేక్ కాగా భాగీ 2 కూడా తెలుగులో మంచి హిట్ అయిన క్షణం చిత్రానికి రీమేక్ కావడం విశేషం .

టైగర్ ష్రాఫ్ – దిశా పటాని జంటగా నటించిన ఈ రెండు చిత్రాలు కూడా తెలుగులో హిట్ అయిన చిత్రాలు కావడం విశేషం . ఇక మొదటి రోజునే 25 కోట్లని కొల్లగొట్టిన ఈ భాగీ 2 మొదటి వారంలో వంద కోట్ల క్లబ్ లో అవలీలగా చేరుతుందని భావిస్తున్నారు . సినీ విమర్శకులు ఈ చిత్రాన్ని పక్కన పెట్టినప్పటికీ ప్రేక్షకులు మాత్రం వసూళ్ల వర్షం కురిపిస్తున్నారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All