
మాస్ రాజా రవితేజ ప్రధాన పాత్రలో పాన్ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. ఉగాది సందర్భాంగా సినిమా ఓపెనింగ్ కార్య క్రమాలు గ్రాండ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి హాజరై చిత్ర బృందానికి అల్ ది బెస్ట్ తెలిపారు.
ఇక ఈరోజు సోమవారం చిత్ర నిర్మాత అభిషేక్ బర్త్ డే సందర్భాంగా సినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. చిత్రానికి సంబదించిన మరిన్ని విశేషాలు త్వరలో తెలియజేస్తామని తెలిపారు. ఇక ఈ మూవీ లో హీరోయిన్ గా నుపూర్ సనన్ నటిస్తుండగా ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘ది కశ్మీర్ ఫైల్స్ ప్రొడ్యూసర్’ అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఓ కీలక రోల్ చేస్తుండడం విశేషం .
- Advertisement -