
మాస్ మహారాజా స్పీడ్ ఏమాత్రం తగ్గడం లేదు..అసలు ఆ ఎనర్జ్ ఎక్కడి నుండి వస్తుందో అర్ధం కావడం లేదు. సినిమా సినిమాకు కాస్త గ్యాప్ అయినా తీసుకుంటారు కానీ రవితేజ మాత్రం ఒకేసారి సెట్స్ పైకి రెండేసి , మూడేసి సినిమాలను తీసుకెళ్లి..ప్రతి రోజు షూటింగ్ లతో గడుపుతూ అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాడు. ఈ మధ్యనే ఖిలాడీ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ..ప్రస్తుతం సెట్స్ ఫై ధమాకా , రామారావు చిత్రాలను ఉంచాడు. వీటిలో రామారావు జూన్ 17 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ రెండు ఇలా ఉండగానే మరో చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకరాబోతున్నాడు.
వంశీ దర్శకత్వంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ అనే సినిమా చేయబోతున్నాడు. ఉగాది రోజున ఈ చిత్రాన్ని ప్రారభించబోతున్నట్లు అధికారికంగా తెలిపారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నాడు. మోస్ట్ వాంటెడ్ దొంగ జీవిత చరిత్రగా, 1970 నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. రవితేజ ఈ సినిమా కోసం తన మేకోవర్ ను మార్చుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీ లో రవితేజ కు జోడిగా ఎవరు నటిస్తున్నారు..మిగతా చిత్ర విశేషాలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది.