Homeటాప్ స్టోరీస్ఫస్ట్ డే రికార్డ్ సృష్టించిన థగ్స్ ఆఫ్ హిందూస్తాన్

ఫస్ట్ డే రికార్డ్ సృష్టించిన థగ్స్ ఆఫ్ హిందూస్తాన్

 Thugs of Hindostan 1st Day world wide Collectionsమొదటిరోజున ఓపెనింగ్స్ లో సరికొత్త సంచలనం సృష్టించింది థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ . అమితాబ్ బచ్చన్ , అమీర్ ఖాన్ , కత్రినా కైఫ్ నటించిన థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ చిత్రం నిన్న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే . అమితాబ్ నటించడం , అమీర్ ఖాన్ హీరో కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి . అయితే ఆ అంచనాలకు తగ్గట్లుగా సినిమా లేకపోయినప్పటికీ భారీ ఓపెనింగ్స్ మాత్రం వచ్చాయి . ఇంతకీ మొదటి రోజున వసూల్ అయిన మొత్తం ఎంతో తెలుసా ……. 52 కోట్లు . బాలీవుడ్ చిత్రాల్లో ఇది నవశకం అనే చెప్పాలి . ఇప్పటివరకు యాభై కోట్ల ఓపెనింగ్స్ సాధించిన చిత్రాలు బాలీవుడ్ లో లేవు కానీ ఆ బ్రేక్ అమీర్ ఖాన్ కు దక్కింది .

- Advertisement -

విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కత్రినా కైఫ్ అందాలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి . బాహుబలి రేంజ్ లో విజయం సాధిస్తుందని ఆశలు పెంచుకున్నారు కానీ అట్టర్ ఫ్లాప్ గా తేలిపోయింది థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ . భారీ సెట్టింగ్ లు వేసినప్పటికీ భారీ తారాగణం ఉన్నప్పటికీ కథ , కథనం లోపించడంతో థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ డిజాస్టర్ జాబితాలో చేరిపోయింది . అయితే అమీర్ ఖాన్ కున్న క్రేజ్ తో ఈ నాలుగైదు రోజులు వసూళ్లు రావడం ఖాయం .

English Title:  Thugs of Hindostan 1st Day world wide Collections

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts