Homeటాప్ స్టోరీస్తోలుబొమ్మలాట మూవీ రివ్యూ

తోలుబొమ్మలాట మూవీ రివ్యూ

తోలుబొమ్మలాట మూవీ రివ్యూ
తోలుబొమ్మలాట మూవీ రివ్యూ

దర్శకత్వం: విశ్వనాధ్ మాగంటి
నిర్మాత: మాగంటి దుర్గాప్రసాద్
సంగీతం: సురేష్ బొబ్బిలి
నటీనటులు: రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, హర్షిత, విశ్వంత్
విడుదల తేదీ: నవంబర్ 22, 2019

ట్రైలర్ తో ఆసక్తి రేకెత్తించిన తోలుబొమ్మలాట చిత్రానికి గత కొంత కాలంగా ప్రమోషన్స్ కూడా ఎక్కువగా జరిగాయి. రాజేంద్ర ప్రసాద్ చాలా కాలం తర్వాత మళ్ళీ కీలకపాత్ర పోషించడంతో, మోస్ట్ వాంటెడ్ కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా ఫుల్ లెంగ్త్ పాత్రలో నటించడంతో ఈ సినిమాపై బజ్ అయితే బాగానే ఏర్పడింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చుద్దామా.

- Advertisement -

కథ:
సోడాల రాజు (రాజేంద్ర ప్రసాద్) ఒక ఊరిలో పలుకుబడి ఉన్న వ్యక్తి. తన మనవడు, మనవరాలిని ఒక్కటి చేయాలని సోడాల రాజు అనుకుంటూ ఉంటాడు. అదే అతని ఆఖరి కోరిక కూడా. అయితే సడెన్ గా ఒకరోజు సోడాల రోజు మరణిస్తాడు. ఆత్మగా తిరిగొచ్చిన సోడాల రాజు తన ఆస్తి విషయంలో కుటుంబసభ్యులు పోరాడుకోవడం చూసి షాక్ అవుతాడు. వెన్నెల కిషోర్ సహాయంతో సోడాల రాజు, ఆ ఇంటి సమస్యల్ని తీర్చి ఎలా తన ఆఖరి కోరిక తీర్చుకున్నాడన్నదే ఈ చిత్ర కథ.

నటీనటులు:
రాజేంద్ర ప్రసాద్ ఒక పరిపూర్ణ నటుడు అన్నదానికి తోలుబొమ్మలాట మరొక ఉదాహరణగా నిలుస్తుంది. తోలుబొమ్మలాట చిత్రం ద్వారా రాజేంద్ర ప్రసాద్ తన నటనలోని వైవిధ్యాన్ని మరోసారి బయటకు తీసాడు. ఇక సినిమా అంతటా ఉండే వెన్నెల కిషోర్ తన పాత్రకు న్యాయం చేసాడు. చాలా చోట్ల తన డీసెంట్ కామెడీతో సినిమాను నిలిపాడు. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కాంబినేషన్ లో వచ్చిన సన్నివేశాలు ఆసక్తిని కలిగిస్తాయి. దర్శకుడి నుండి నటుడిగా మారిన దేవి ప్రసాద్ నెగటివ్ రోల్ లో ఆకట్టుకున్నాడు. హర్షిత, విశ్వంత్ తమ పాత్రల మేరకు డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు.

సాంకేతిక వర్గం:
ముందుగా తోలుబొమ్మలాట కథ గురించి చర్చించుకోవాలి. కథ పాతదైనా కథనం కొత్తగా ఉండేలా చూసుకుంటున్నారు ఈరోజు ఫిల్మ్ మేకర్స్. అయితే ఈ చిత్రంలో కథ, కథనం, దర్శకత్వం అన్నీ ఒక 15 ఏళ్ల క్రితం సినిమా చూస్తున్నామన్న భావన కలిగిస్తాయి. ఓల్డ్ స్కూల్ నరేషన్ తో ప్రేక్షకులను విసిగిస్తాడు దర్శకుడు. ఈ పాయింట్ ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో చూసేసాం. సురేష్ బొబ్బిలి సంగీతం, నేపధ్య సంగీతం రెండూ కూడా యావరేజ్ గానే అనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. ఆర్ట్ వర్క్ ను మెచ్చుకోవాలి. విలేజ్ సెటప్ ను, పాత ఇంటి సెటప్ ను బాగా వేశారు. ఎడిటింగ్ బాలేదు. సెకండ్ హాఫ్ లో చాలా డల్ మూమెంట్స్ ఉన్నాయి. అవన్నీ కత్తిరించేయొచ్చు. నిర్మాణ విలువలు కూడా డీసెంట్ గా ఉన్నాయి.

చివరిగా:
తోలుబొమ్మలాటలో చర్చించిన పాయింట్ ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూసేసాం. కనీసం కథనం అయినా కొత్తగా ఉండేలా చూసుకోవాల్సింది. ఒక పదిహేనేళ్ల క్రితం విడుదలై ఉంటే తోలుబొమ్మలాట ఒక అద్భుతమైన సినిమా ఫీల్ ఇచ్చేది. కానీ ఇప్పటికే ఎన్నో సార్లు చూసేసాం కాబట్టి బోర్ కొట్టడం ఖాయం. రాజేంద్ర ప్రసాద్ – వెన్నెల కిషోర్ కాంబినేషన్ మీద ఆసక్తి ఉన్న వారు ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు.

రేటింగ్ : 2/5

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All