Homeటాప్ స్టోరీస్`తొలిప్రేమ` ప్రీ రిలీజ్ వేడుక‌

`తొలిప్రేమ` ప్రీ రిలీజ్ వేడుక‌

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి ప‌తాకంపై నిర్మితమైన చిత్రం `తొలిప్రేమ‌`. రాశి ఖ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది. యువ ద‌ర్శకుడు వెంకీ అట్లూరి ద‌ర్శ‌కుడు. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మాత‌. ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 10న విడుద‌ల చేస్తున్నారు.  ఈ సంద‌ర్భంగా భీమ‌వ‌రంలో ఎస్‌.ఆర్‌.కె.ఆర్‌.కాలేజ్‌లో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ జ‌రిట‌గింది. ఈ కార్య‌క్ర‌మంలో దిల్‌రాజు, బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌, ఎమ్మెల్యే రాధాకృష్ణ‌,హీరో వ‌రుణ్ తేజ్‌, రాశీ ఖ‌న్నా, ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి, హైప‌ర్ ఆది, డిస్ట్రిబ్యూట‌ర్ ఎల్‌.వి.ఆర్‌, త‌ణుకు డి.ఎస్‌.పి. ఎస్‌.ఆర్‌.కె.ఆర్‌.కాలేజ్ ప్రిన్సిపాల్ పార్థ‌సార‌థి త‌దిత‌రులు పాల్గొన్నారు. 
ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ – “క‌థ‌ను రాసింది, రిలీజ్ చేసేది దిల్‌రాజుగారైతే, సినిమాను నిర్మించింది మాత్రం బివిఎస్ఎన్‌.ప్ర‌సాద్‌గారు. జీవితం ఓ స‌ర్కిల్ అని వినే ఉంటాం. నా జీవితంలో అలాగే జ‌ర‌గుతుంది. తొలిప్రేమ సినిమాను చేసిన‌ప్పుడు, చూసిన‌ప్పుడు ప్రేక్ష‌కుల‌కు ఓ ఫ్రెష్ నెస్ ఎలా క‌లిగిందో.. అలాంటిఫ్రెష్‌నెస్‌తోనే ఈ సినిమాను మేం చేశాం. ఈ సినిమా టైటిల్ పెట్టిన‌ప్పుడు కాస్త భ‌య‌ప‌డ్డాం. వ‌రుణ్` టైటిల్ అయితే పెడుతున్నాం.. ప‌రావాలేదు క‌దా!`అన్నాడు. ఆ సినిమాతో నేను పోలిక పెట్ట‌ను కానీ.. గౌర‌వాన్ని కాపాడుతాన‌ని మాట ఇస్తున్నాను. సినిమా అంటే టీంఎఫ‌ర్ట్ అని ఎందుకంటారో నాకు ఇప్పుడు అర్థ‌మ‌వుతుంది. ప్రేక్ష‌కుల‌కు సినిమా బాగా న‌చ్చుతుంది“ అన్నారు. 
బివిఎస్ఎన్‌.ప్ర‌సాద్ మాట్లాడుతూ – “33 సంవ‌త్స‌రాల క్రితం మెగాస్టార్‌తో సినిమా తీయాల‌ని త‌ణుకు నుండి మ‌ద్రాస్ వెళ్లాను. త‌ర్వాత బ‌న్నితో ఆర్య 2, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌తో మ‌గ‌ధీర‌, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో అత్తారింటికి దారేది సినిమాలు చేసే అవ‌కాశం ద‌క్కింది. ఇప్పుడు మా మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్‌తో తొలిప్రేమ సినిమా చేశాం. గ్యారంటీగా సినిమా పెద్ద హిట్ అవుతుంది“ అన్నారు. 

దిల్‌రాజు మాట్లాడుతూ – “భీమ‌వరం ఊర్లో ఏముందో తెలియ‌దు కానీ ఇక్క‌డ నుండి త్రివిక్ర‌మ్‌, సునీల్ వంటివారు ప‌క్క‌నున్న పాల‌కొల్లు నుండి చిరంజీవిగారు, కృష్ణంరాజుగారు, ప్ర‌భాస్ వంటి ఎంద‌రో తెలుగు సినిమాలోకి వ‌చ్చారు. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి ఓ పిల్ల‌ర్‌లా ఇక్క‌డి నుండి వ‌చ్చిన‌వారున్నారు. ఇక్క‌డ నీటిలోనే ఏదోఉంది. సినిమాకు కావాల్సిన క‌ళ ఇక్క‌డ ఉంది. అదే మిమ్మ‌ల్ని, మ‌మ్మ‌ల్ని ఇక్క‌డి వ‌ర‌కు తీసుకొచ్చింది. అప్పుడు 1998 తొలిప్రేమకు నేనే డిస్ట్రిబ్యూట‌ర్‌ని, 2018 తొలిప్రేమ‌కు నేనే డిస్ట్రిబ్యూట‌ర్‌ని. ఆ తొలిప్రేమ యూత్ ఫిలిం ఎలా అయ్యిందో.. ఈ సినిమా కూడా 100 ప‌ర్సంట్ అలాంటి యూత్‌ఫిలిం అయ్యింది. రెండేళ్ల కిత్రం వెంకీ నాకు చెప్పిన క‌థ ఇది. బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీ. వ‌రుణ్‌కు ఫిదా త‌ర్వాత ఈ సినిమా రావ‌డం ప్ల‌స్ అవుతుంది. ఫిదా సినిమా రిలీజ్ అయిన తొలి ఆట నుండి అద్భుతం అని ఎలా అన్నారో.. ఇప్పుడు అలాగే అంటారు. వ‌న్ ఆఫ్ ది బెస్ట్ ల‌వ్‌స్టోరీ. వ‌రుణ్‌, రాశీ ఖన్నా మ‌ధ్య బ్యూటీఫుల్ కెమిస్ట్రీ కుదిరింది. ఫిబ్ర‌వ‌రి 10న తెలుగు రాష్ట్రాల్లో విడుద‌ల‌వుతుంది. అయితే ఒక‌రోజు ముందుగానే ఈ సినిమా అమెరికాలో రిలీజ్ అవుతుంది. మెగాఫ్యాన్స్‌కి మంచి పండుగ‌లాంటి సినిమా“ అన్నారు. 
వ‌రుణ్ తేజ్ మాట్లాడుతూ – “మా సినిమాకు ప‌నిచేసిన దర్శ‌కుడు వెంకీ తొలి చిత్ర‌మే అయినా ఎంతో కన్విక్ష‌న్‌తో చేశాడు. త‌ను భ‌విష్య‌త్‌లో పెద్ద ద‌ర్శ‌కుడ‌వుతాడు. ఇక ఈ సినిమా అంద‌రి కంటే ఎక్కువ‌గా న‌మ్మింది నిర్మాత దిల్‌రాజుగారే. ఈ సినిమాకు ఓ స‌పోర్ట్‌గా నిలిచారు. ఇక బాపినీడు, ప్ర‌సాద్‌గారు సినిమాను అద్భుతంగా నిర్మించారు. సినిమాటోగ్ర‌ఫీ జార్జ్ విలియ‌మ్స్ ప్ర‌తి సీన్‌ను ఎంతో అందంగా చూపించారు. తొలి ప్రేమ అన్న టైటిల్‌తో 20 సంవ‌త్స‌రాలు త‌ర్వాత నేను అదే టైటిల్‌తో చేస్తున్న సినిమా ఇది. ఆ సినిమాకు ఇది రీమేకో, కాపీయో కాదు. క‌థకు త‌గ్గ టైటిల్ అనిపించే పెట్టాం. బాబాయ్ టైటిల్‌ను పాడు చేస్తాన‌ని ఎవ‌రూ అనుకోవ‌ద్దు. ఫిబ్ర‌వ‌రి 10న సినిమా విడుద‌ల‌వుతుంది. మా ఫ్యామిలీ నుండి తేజు సినిమా ఫిబ్ర‌వ‌రి 9న, నా సినిమా ఫిబ్ర‌వ‌రి 10న విడుద‌ల‌వుతుంది. మా మ‌ధ్య కాంపీటీష‌న్ ఏదీ లేదు. ఇద్ద‌రం చిన్న‌ప్ప‌ట్నుంచి క‌లిసే పెరిగాం. నా సినిమా ఎంత పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నానో, తేజు సినిమా కూడా అంతే స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All