Homeటాప్ స్టోరీస్సిజి కారణం గానే 'తొలికిరణం' ఆలస్యం అయింది: చిత్ర యూనిట్

సిజి కారణం గానే ‘తొలికిరణం’ ఆలస్యం అయింది: చిత్ర యూనిట్

Tholi Kiranam Movie Press Meetసువర్ణ క్రియేషన్స్ పతాకం పై జాన్ బాబు దర్శకత్వం లో సీనియర్ హీరో భానుచందర్ ముఖ్య పాత్ర చేయగా పి.డి. రాజు యేసు క్రీస్తు రోల్ పోషిస్తున్న చిత్రం “తొలికిరణం”. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యం లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు చిత్ర యూనిట్. ఈ సందర్బంగా భానుచందర్ మాట్లాడుతూ తొలికిరణం అంటే ‘ఫస్ట్ లైట్’ అని అర్థం. యేసు ప్రభు కు సంబంధించిన సినిమా లు చాలా నే వచ్చాయి కానీ అతని జీవిత కథ ఆధారంగా క్రీస్తు పుట్టిన దగ్గరనుంచి చనిపోయే దాకా ఉన్న కథ లు మాత్రమే మనకు తెలుసు. తొలికిరణం అలా కాదు ఆయన చనిపోయి 3 రోజుల తరువాత బ్రతికి వచ్చి ఏం చేసాడు.. భక్తులకు ఏం బోధించాదు అనే కాన్సెప్ట్ తో వస్తున్న మొదటి సినిమా… ఇజరయిల్ దేశానికి వెళ్లి రీసెర్చ్ చేసి మరీ తీసిన సినిమా ఇది. ఇక క్రీస్తు పాత్రలో పిడి రాజు ఒదిగిపోయారు. ఆయన్ను చూస్తుంటే అచ్చు క్రీస్తు భగవానుని చూస్తున్నట్టే ఉంది.

ఇందులో క్రీస్తు హ్యూమన్ కాదు గాడ్ ఎలా అయ్యాడు అని తెలుసుకోవడానికి వచ్చిన హనుమంత్ యూసుఫ్ పాత్రను పోషించాను. త్వరలో జాన్ బాబు డైరెక్షన్ లో మా బాబు జయంత్ తో ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నామని ఈ సందర్బంగా మీ అందరితో పంచుకోవడం ఆనందం గా ఉంది అన్నారు. డైరెక్టర్ జాన్ బాబు మాట్లాడుతూ ఈ చిత్రం లో గ్రాఫిక్స్ 45 .మినిట్స్ ఉండటం అందుకు లండన్ లో వర్క్ జరగటం మూలానే సినిమా విడుదల ఆలస్యం అవుతోంది.. లేట్ అయినా క్వాలిటీ అందించాలనే తపనతో జాప్యం జరిగింది. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయి అతి త్వరలో చిత్రాన్ని విడుదల చేయనున్నాము.. నా స్నేహితుడు నిర్మాత సుధాకర్ నాకు చాలా సహకరించారు.. ఖర్చుకు ఏ మాత్రం వెనకాడకుండా 8 కోట్ల బడ్జెట్ తో తీసిన చిత్రం ఇది. ఇజ్రాయిల్ దేశంలో షూట్ చేసాము. 2000 ల నాటి కాలంలో వాడిన కాస్ట్యూమ్స్ ను ఈ చిత్రానికి డిజైన్ చేయించడం జరిగింది అంత పక్కాగా, పర్ఫెక్ట్ గా ఈ చిత్రానికి పని చేయడం జరిగింది. క్రీస్తు జీవిత కథను ఎందరో స్మరించుకొని ఆయన దీవెనెలు పొందాలనే ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. నా నెక్స్ట్ మూవీ భానుచందర్ గారి అబ్బాయి జయంత్ తో మొదలు కానుంది ఆ వివరాలు త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. పి.డి రాజు మాట్లాడుతూ.. క్రీస్తు పాత్రను పోషిస్తున్నందుకు ఆనందం గా ఉంది. అన్నారు

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All