Homeటాప్ స్టోరీస్కుర్ర హీరోలకి పెద్ద దర్శకులు చిన్న పాత్ర ఇచ్చినా సరిపోతుందా?

కుర్ర హీరోలకి పెద్ద దర్శకులు చిన్న పాత్ర ఇచ్చినా సరిపోతుందా?

కుర్ర హీరోలకి పెద్ద దర్శకులు చిన్న పాత్ర ఇచ్చినా సరిపోతుందా?
కుర్ర హీరోలకి పెద్ద దర్శకులు చిన్న పాత్ర ఇచ్చినా సరిపోతుందా?

మహానటి‘ సినిమా ద్వారా తెలుగు తెరకు ఒక గొప్ప మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు ‘నాగ్ అశ్విన్‘ గారు. మొదటి సినిమా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ కూడా విమర్శకుల దగ్గర మంచి మార్కులు కొట్టేసింది. అయితే ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో చేసిన చిన్న పాత్ర వలన ‘విజయ్ సాయి దేవరకొండ’ ఈ రోజు టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ హీరోగా చెలరేగిపోతున్నారు. వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు.

అయితే కొంతమంది కుర్ర హీరోలు పెద్ద దర్శకుల సినిమాలో చిన్న పాత్రలో అయిన నటిస్తే ఒక్కరోజులో సుడి తిరిగినట్టే అని భావిస్తారు. అందుకోసం వారు రేయింబవళ్లు కష్టబడుతూనే ఉంటారు. కొంతమంది అయితే వచ్చిన అవకాశాన్ని చేయిజార్చుకోవడం ఇష్టం లేక వారికి నటన రాకపోయినా సినిమాలో మెయిన్ కథానాయకుడుగా చేసేస్తూ ఉంటారు. సినిమా థియేటర్ లో ఆడకపోయే సరికి జనాల దృష్టికి పోయి చివాట్లు తింటారు. ఈ సంవత్సరంలో ఎక్కువగా కొత్త కథానాయకులు వారి సినిమాలని విడుదల చేసారు. చెప్పినట్లే చేతులు కాల్చుకొని వెనక్కి తిరిగి వెళ్లిపోయారు.

- Advertisement -

కొంతమంది నటులు అనగా నవదీప్, రాహుల్ రవీంద్రన్, ప్రిన్స్ లాంటి వాళ్ళు పెద్ద దర్శకుల చేతిలో పడిన కూడా వారు వారి ప్రతిభని వదులుకోకుండా మంచి కథలని ఎంచుకుంటూ అప్పుడప్పుడు హీరోలుగా దర్శకులుగా చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి అక్కినేని వారి మనువడు ‘సుశాంత్’ వచ్చి చేరారు. గత సంవత్సరం రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో చేసిన ‘చిలసౌ’ సినిమా విజయం తర్వాత మన వాడికి ఇంకొక దర్శకులు, నిర్మాతలు ఎవరు అవకాశం ఇవ్వలేదు. అవకాశాల కోసం ఎదురు చూస్తూ మాధ్యమాల్లో తన అభిమానులని నిరాశపెట్టేవారు.

‘కాళిదాసు’ సినిమాతో ఆరంగేట్రం చేసిన సుశాంత్ నటన పరంగా మెప్పించుకున్నాడు కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. తర్వాత వచ్చిన ‘కరెంట్’ సినిమాతో యువతని తన వైపు లాగేసుకున్నాడు. ఆ సినిమాలో నటన పరంగా మెప్పించుకున్నాడు అలాగే సినిమా కూడా మంచి విజయం సాధించింది. తర్వాత అడ్డా, ఆటాడుకుందాం రా సినిమాల ద్వారా మళ్ళీ ఫ్లాపుల బాటలో పడ్డాడు. తర్వాత చిలసౌ ఫార్మ్ లోకి వచ్చాడు. ఇలా పడుతూ లేస్తూ సినిమాలు చేస్తూ ఉన్నాడు. ఒకొక్క సినిమాకి దాదాపు 2 నుండి 4 సంవత్సరాలు గ్యాప్ తీసుకుంటాడు ఈ అక్కినేని మనువడు.

అయితే ఈ సారి అలా సంవత్సరాలు సమయం తీసుకోకుండా ఏకంగా ‘త్రివిక్రం శ్రీనివాస్’ గారి చేతిలో పడ్డాడు. 2020 సంక్రాంతికి రాబోతున్న అల్లు అర్జున్ ‘అలా వైకుంఠపురములో’ అనే సినిమాలో ఒక మంచి పాత్ర చేస్తున్నాను అని చెప్పి మాధ్యమాల్లో ఒక ఫోటో ని అప్లోడ్ చేసాడు. అల్లు అర్జున్ అభిమానులు మన వాడికి బెస్ట్ అఫ్ లక్ కూడా చెప్పేస్తున్నారు. పాపం హిట్టు కోసం బాగా పరితపిస్తున్న సుశాంత్ కి త్రివిక్రం గారి సినిమా పరంగా మన వాడి కెరీర్ గాడిలో పడుతుంది అని కొంతమంది అనుకుంటున్నారు. అతనికి ఈ సినిమా అయినా ఒక మంచి మైలు రాయిని ఇవ్వాలి అని వేడుకుంటున్నారు భగవంతుణ్ణి.

నిజానికి అక్కినేని ‘నాగార్జున’ గారి మేనల్లుడు అయిన సుశాంత్ అవకాశాల కోసం బాగానే కష్టపడుతున్నాడు. కానీ కథల ఎంపికల పరంగా ఎవరన్న మనవాడికి సహకరిస్తే నటన పరంగా తనని తాను నిరూపించుకోగలడు అని ఒక నమ్మకాన్ని ఏర్పరచుకున్నాడు. చూద్దాం మరీ విజయ్ దేవరకొండ లాగ అవకాశం వస్తే చెలరేగిపోతాడో? లేక నవదీప్, రాహుల్ రవీంద్రన్ వారి మాదిరిగా తనకంటూ ఒక గుర్తింపు తెచుకుంటాడో?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All