Homeఎక్స్ క్లూసివ్థియేటర్ లు ఇవ్వడం లేదని గగ్గోలు పెడుతున్నాడు

థియేటర్ లు ఇవ్వడం లేదని గగ్గోలు పెడుతున్నాడు

Theatres problems for Peta telugu film
Theatres problems for Peta telugu film

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సినిమాకు థియేటర్ లు ఇవ్వడం లేదని , థియేటర్ లన్ని కేవలం కొంతమంది చేతుల్లోనే ఉన్నాయని గగ్గోలు పెడుతున్నాడు నిర్మాత అశోక్ వల్లభనేని . తాజాగా రజనీకాంత్ నటించిన పేట చిత్రాన్ని తెలుగులో ఈనెల 10 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు ఈ అశోక్ . అయితే సంక్రాంతి సీజన్ కావడంతో పాటుగా బాలయ్య నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు , రాంచరణ్ నటించిన వినయ విధేయ రామ , వెంకటేష్ –వరుణ్ తేజ్ నటించిన ఎఫ్ 2 చిత్రాలు వరుసగా రిలీజ్ అవుతుండటంతో పేట చిత్రానికి పెద్దగా థియేటర్ లు దొరకలేదు .

ఇక దొరికిన కొన్ని థియేటర్ లు కూడా పాతవి , ఎక్కడో మూలన ఉన్న థియేటర్ లు దాంతో ఈ సినిమా తెలుగు హక్కులు తీసుకున్న అశోక్ వల్లభనేని రజనీకాంత్ సినిమాకు సైతం థియేటర్ లు దొరకడం లేదని ఆగ్రహంతో ఊగిపోతున్నాడు . సినిమారంగంలో ఈ పరిస్థితి ఎప్పటి నుండో ఉంది . థియేటర్ లన్ని ఓ నలుగురి చేతుల్లోనే ఉన్నాయి దాంతో చిన్న నిర్మాతలు చాలా ఇబ్బందులు పడుతున్నారు .

- Advertisement -

English Title: Theatres problems for Peta telugu film

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All