Homeటాప్ స్టోరీస్తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో రూపొందిన "ఉద్యమ సింహం" యూట్యూబ్ లో విడుదల

తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో రూపొందిన “ఉద్యమ సింహం” యూట్యూబ్ లో విడుదల

 

- Advertisement -

తెలంగాణ ఉద్యమసారధి .. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జరిగిన తెలంగాణ పోరాట నేపధ్య కథతో తెరకెక్కిన చిత్రం ”ఉద్యమసింహం”. నటరాజన్, మాధవి రెడ్డి, జలగం సుధీర్, లత ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. పద్మనాయక ప్రొడక్షన్స్ పతాకం పై కల్వకుంట్ల నాగేశ్వర రావు నిర్మిస్తున్న ఈ చిత్రం 29న విడుదలకు అన్నీ వేర్పాట్లు చేశారు కానీ కొందరు ఈ సినిమా విడుదల అవ్వకుండా సమస్యలు రేపుతున్నారు. డిస్ట్రిబ్యూటర్లని , సినిమా థియేటర్ ఓనర్స్ ని బెదిరించి సినిమా ఎవరు విడుదల చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చారు. అయితే నిర్మాతలు కల్వకుంట్ల నాగేశ్వర రావు ఎవరికి భయపడకుండా ఉద్యమ సింహం చిత్రాన్ని యూట్యూబ్ లో టివి చానెల్స్ లో ఫ్రీ గా విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భం గా ఫిలించాంబర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో
నిర్మాత కల్వకుంట్ల నాగేశ్వర రావు మాట్లాడుతూ “ఉద్యమ సింహం సినిమా ని ఈ నెల 29 న విడుదల చేద్దాం అని అనుకున్నం కానీ కొందరు మా సినిమా నీ విడుదల అవ్వకుండా అడ్డుపడుతున్నారు. ఈ సినిమా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జరిగిన తెలంగాణ పోరాట నేపధ్య కథ తో ఉండే సినిమా. ఎన్ని ఒడిడుకులు ఎదుర్కొని పోరాడి తెలంగాణను కేసీఆర్ సాధించాడు. ఆ తరువాత దాన్ని బంగారు తెలంగాణ గా మార్చేందుకు అయన చేస్తున్న కృషి ఏమిటన్నది ఈ సినిమా
చాలా బాగా వచ్చింది. తెలంగాణ లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి అని నేను ఈ సినిమాని యూట్యూబ్ మరియు టీవీ చానెల్స్ లో ఫ్రీ గా విడుదల చేస్తున్నాను. యూట్యూబ్ నిర్వాహకులు మా సినిమా ని మీ ఛానల్ లో పెట్టుకోవచ్చు , కాపీ రైట్స్ సమస్య లేదు. ఎవరైనా అప్లోడ్ చేసుకోవచ్చు” అని తెలిపారు.
కేసీఆర్ పాత్రలో నటరాజన్ చక్కగా నటించారు. అన్ని రకాల కమర్షియల్ హంగులతో ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రానికి సంగీతం : దిలీప్ బండారి, మాటలు : కృష్ణా రాపోలు, యాక్షన్ : సూపర్ ఆనంద్ , సినిమాటోగ్రఫీ : ఉదయ్ కుమార్, ఎడిటింగ్ : నందమూరి హరి, డాన్స్ : గణేష్, మేకప్ : చంటి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All