Homeటాప్ స్టోరీస్సినిమా బాగోలేదంటే టిక్కెట్ డబ్బులు వెనక్కి ఇస్తాం.. హీరో సవాల్

సినిమా బాగోలేదంటే టిక్కెట్ డబ్బులు వెనక్కి ఇస్తాం.. హీరో సవాల్

Aravind Reddy
సినిమా బాగోలేదంటే టిక్కెట్ డబ్బులు వెనక్కి ఇస్తాం.. హీరో సవాల్

తెలుగు ప్రేక్షకులకు అందమైన ప్రేమకథ అందించేందుకు వస్తున్న చిత్రం
నీకోసం. నిజ జీవితంలో చూసిన విన్నసంఘటనల నుండి పుట్టిన కథే నీ కోసం. అందరూ కొత్త వల్లే అయినా కొత్తదనం నిండిన కథతో ఎంటర్టైన్ చేసేందుకు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు నీకోసం అంటూ వస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు మంచి ఆదరణ లభిస్తోంది.

కాగా ఈ చిత్రం సెప్టెంబర్ 6న విడుదల కానుంది.. ‘అందరం కొత్తవాళ్లమే. ఈ సినిమా ఎందుకు చూడాలి అనే వారికి నేను ఇచ్చే భరోసా ఒక్కటే ఈ సినిమా ఆడుతున్న థియేటర్స్ దగ్గర నా మొబైల్ నెంబర్ కౌంటర్ లో ఇస్తాను చూసి ఈ సినిమా బాగోలేదు అంటే నేను వాళ్ళ డబ్బులు వెనక్కి ఇస్తాను.

- Advertisement -

ఈ సినిమా నా ఫ్యామిలీ సపోర్ట్ తో చేశాను. నా సహోదరి నాకు అండగా నిలబడింది. దర్శకుడు నా స్నేహితుడు. ఒక ఆడియన్ గా సినిమాలు చూసే నేను ఇప్పుడు నా కుటుంబం ఇచ్చిన సపోర్ట్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు ప్రయత్నించాను . సినిమా కథ అనుకున్నప్పటి నుండి ఫస్ట్ కాపీ చూసే వరకూ కూడా అంతే నమ్మకం తో పనిచేసాము. అనుకున్న దాని కంటే బాగా కథ ను తెరమీద చూపాడు దర్శకుడు. ఒక మంచి ప్రేమకథ చూసిన ఫీల్ తప్పకుండా ప్రేక్షకులు ఫీల్ అవుతారు ” అన్నారు.. హీరో అరవింద్ రెడ్డి..!!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All