
ఓ పరాజితుడి విజయ గాథ నేపథ్యంలో రూపొందిన చిత్రం `జెర్సీ`. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి సోమవారం ప్రకటించిన 67వ జాతీయ పురస్కారాల్లో జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు లభించింది. అలాగే ఎడిటింగ్ విభాగంలోనూ ఉత్తమ ఎడిటర్‌గా నవీన్ నూలికి అవార్డు దక్కింది.
అయితే ఆ అవార్డు కూడా వచ్చుంటే బాగుండేదని దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. `తెలుగు నుంచి మంచి సినిమాలు వస్తున్నాయి కదా వాటిలో మా చిత్రం విజేతగా నిలవడం ఆనందమే అంతే కానీ జాతీయ ఉత్తమ చిత్రంగా పురస్కారం రాలేదనే అసంతృప్తి అంటూ ఏమీ లేదు. `జెర్సీ`కి ఎడిటింగ్ విభాగంలో నవీన్ నూలికి జాతీయ పురస్కారం రావడం సంతోషాన్నిచ్చింది. ఆయన మంచి ఎడిటర్. నవీప్ సినిమాపైనా, సన్నివేశాలపైనా మంచి పట్టుని ప్రదర్శిస్తుంటాడు.
తను జాతీయ పురస్కారానికి అర్హుడు. అది మా సినిమాతో అందుకోవడం ఇంకా ఆనందంగా వుంది. ఉత్తమ నటుడిగా నానికి పురస్కరాం దక్కాల్సింది. అదొక్కటి వచ్చుంటే `జెర్సీ` పరిపూర్ణం అయ్యేది` అని తన మనసులోని మాటని బయటపెట్టారు. గౌతమ్ తిన్ననూరి ప్రస్తుతం ఇదే చిత్రాన్ని ఇదే పేరుతో హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. షాహీద్ కపూర్ నటిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, అమన్ గిల్, దిల్ రాజు నిర్మిస్తున్నారు. నవంబర్ 5న ఈ చిత్రం విడుదల కానుంది.
Huge honour for entire cast and crew of Jersey. Every award and recognition for Jersey belongs to you all for loving it and making your own since the day it released. Thank you ????#NationalAward #Jersey pic.twitter.com/t2mAzqOR4m
— gowtam tinnanuri (@gowtam19) March 23, 2021