Homeటాప్ స్టోరీస్సల్మాన్ ఖాన్ షూటింగ్ లో ఘోరం

సల్మాన్ ఖాన్ షూటింగ్ లో ఘోరం

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజాగా దబాంగ్ 3 చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే . అయితే ఆసినిమా ప్రస్తుతం మధ్యప్రదేశ్ లోని అహల్య కోటలో షూటింగ్ జరుపుకుంటోంది . కాగా షూటింగ్ జరుగుతున్న సమయంలో కోటలోని ఓ పురాతన విగ్రహం చేయి తెగిపడటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది . అతి ప్రాచీనమైన విగ్రహం చేయి తెగి పడటంతో ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది అక్కడి పరిస్థితి .

- Advertisement -

ఎందుకంటే ప్రాచీన సంపద కాబట్టి స్థానికులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు , అయితే పరిస్థితి అదుపు తప్పకుండా మిగతా వాళ్ళు అదుపు చేయడంతో సద్దుమణిగింది . గొడవలు జరగలేదు కానీ స్థానికులు మాత్రం తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు సల్మాన్ ఖాన్ చిత్ర బృందం పైన . స్థానికులు ఆగ్రహంతో ఉన్నారని తెలుసుకొని అక్కడి నుండి వెళ్లిపోయారు చిత్ర బృందం , అయితే పెద్దలను పిలిచి రాజీ చేసే ప్రయత్నాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయట . దబాంగ్ 3 చిత్రానికి ప్రభుదేవా దర్శకుడు అన్న విషయం తెలిసిందే .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All