Homeటాప్ స్టోరీస్ఆ ఎన‌ర్జీ కొన్ని సార్లు అలా వ‌చ్చేస్తుందంతే!

ఆ ఎన‌ర్జీ కొన్ని సార్లు అలా వ‌చ్చేస్తుందంతే!

ఆ ఎన‌ర్జీ కొన్ని సార్లు అలా వ‌చ్చేస్తుందంతే!
ఆ ఎన‌ర్జీ కొన్ని సార్లు అలా వ‌చ్చేస్తుందంతే!

విక్ట‌రీ వెంక‌టేష్‌, నాగ‌చైత‌న్య క‌లిసి న‌టిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `వెంకీమామ‌`. దివంగ‌త మూవీమొగ‌ల్ ఈ ఇద్ద‌రిని కలిపి సినిమా చేయాల‌ని అప్ప‌ట్లో అనుకున్నార‌ట‌. కానీ అది కుద‌ర‌లేదు. ఆయ‌న క‌ల‌ని వెంక‌టేష్‌, సురేష్‌బాబు `వెంకీమామ‌`తో నిజం చేస్తున్నారు. బాబీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంపై భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి. మామా అల్లుళ్ల సెంటిమెంట్ నేప‌థ్యంలో రూపొందిన ఈ చిత్రం శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకోస్తోంది. ఈ సంద‌ర్భంగా హీరో వెంక‌టేష్ మీడియాతో ప‌లు ఆస‌క్తిక‌ర విశేషాల్ని పంచుకున్నారు. ఈ సినిమా అనుకున్న‌ప్ప‌టి నుంచి త‌న‌లో మంచి జోష్ మొద‌లైందిని, మేన‌ల్లుడితో క‌లిసి న‌టిస్తున్న సినిమా కావ‌డం వ‌ల్లే ఇలా అనిపిస్తుందేమో తెలియ‌డం లేద‌ని, అయితే కొన్ని కొన్ని సార్లు ఎన‌ర్జీ అలా వ‌చ్చేస్తుంటుంద‌ని చెప్పుకొచ్చారు.

`వెంకీమామ‌` ఎన్నో మ‌ధురజ్ఞాప‌కాల్ని మిగిల్చింది. ఎన్నో క‌థ‌లు విని చివ‌రికి ఈ క‌థ‌ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇందులో మంచి కంటెంట్ వుంది. స‌న్నివేశాలు, పాత్ర‌ల ప‌రంగా మంచి డెప్త్ వున్న సినిమా ఇది. అలాగే అంద‌రికి కావాల్సిన క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌న్నీ ఇందులో వున్నాయి. ఈ మ‌ధ్య కాలంలో ఇలాంటి క‌థ రాలేదు. నిజ‌జీవితంలో మామా అల్లుళ్ల‌మైన మేము ఇద్ద‌రం క‌లిసి ఈ సినిమా చేయ‌డం కొత్త అనుభూతినిచ్చింది. నేను ఎలాంటి చిత్రాలు చేసినా ప్రేక్ష‌కులు ఆద‌రించారు. `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు`లో చిన్నోడు పెద్దోడు పాత్ర‌ల్ని ఆద‌రించారు. `వెంకిమామ‌`లో ఫ్యామిలీ అంశాల‌తో పాటు యాక్ష‌న్ పార్ట్ కు కూడా స‌మాన ప్రాధాన్య‌త‌నిచ్చాం. మా ఫ్యామిలీలో చైతూ క్యూట్ బోయ్‌. చిన్నిత‌నంలో వాడితో స‌ర‌దాగా ఫైట్ చేసేవాళ్లం. అలాంటి వాడు సినిమాల్లోకి రావ‌డం, హీరో కావ‌డం, నాతో క‌లిసి న‌టించ‌డం చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. న‌టించాలి, సినిమాల్లోకి రావాల‌ని చైకి ఎప్పుడూ లేదు. మ‌మ్మ‌ల్ని ప్రేమ‌తో అంగీక‌రించి ప్రోత్స‌హిస్తున్న ప్రేక్ష‌కుల‌కు ఈ సంద‌ర్భంగా థాంక్స్ చెబుతున్నాను. ప్రేక్ష‌కులు అంగీక‌రించిన‌ప్పుడు ఓ న‌టుడి రియ‌ల్ జ‌ర్నీ మొద‌ల‌వుతుంద‌ని చెప్పుకొచ్చారు.

- Advertisement -

తెలుగు ప్రేక్ష‌కులు గొప్ప మ‌న‌సున్న వాళ్ల‌ని, ఒక్క‌సారి ఆద‌రిస్తే ఎన్ని ఫ్లాపులిచ్చినా మ‌ళ్లీ హిట్ సినిమా ఇస్తే అదంతా మ‌ర్చిపోతార‌ని పేర్కొన్నారు. రాత్రికి రాత్రే ఏదీ రాద‌ని అంద‌రికి తెలుస‌ని, ఆ విష‌యాన్ని చైతూ కూడా తెలుసుకున్నాడ‌ని, ఈగోని ప‌క్క‌న పెడితేనే ఈ రంగంలో అన్నీ నేర్చుకుంటాం. రాణిస్తామ‌న్న విష‌యాన్ని మా నాన్న‌గారి ద్వారా, అన్న సురేష్బాబు ద్వారా తెలుసుకున్నాన‌ని వెంక‌టేష్ ఈ సందర్భంగా వెల్ల‌డించారు. ప్ర‌తీ ఒక్క‌రిలోనూ ఏతో ఒక ప్ర‌త్యేక‌త వుంటుంది. అలా అని ఎదుటి వారితో పోల్చుకోకుండా మ‌నకు తెలిసిన దారిలో వెళ్లిన‌ప్పుడే స‌క్సెస్ అవుతాం. ఈ సూత్రాన్ని మా ఫ్యామిలీ మెంబ‌ర్స్ పాటిస్తున్నారు కాబ‌ట్టే స‌క్సెస్ అవుతున్నార‌ని తెలిపారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All