
థమన్ ఇప్పుడు ఈ పేరు మారుమోగిపోతుంది. అల వైకుంఠపురం లో చిత్రంతో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకున్న థమన్..వరుస పెట్టి మ్యూజికల్ హిట్స్ అందుకుంటున్నాడు. కేవలం పాటలే కాదు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా థియేటర్స్ లలో స్పీకర్లు పేలిపోయేలా దంచికొడుతున్నాడు. అఖండ , భీమ్లా నాయక్ చిత్రాలతో వరుస హిట్స్ అందుకున్న థమన్..తాజాగా ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చి ప్రభాస్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. రాధే శ్యామ్ కు ఈ మాత్రమన్న టాక్ రావడానికి విజువల్ ఎఫెక్ట్స్ ఒక కారణమైతే థమన్ బ్యాక్ గ్రౌండ్ మరోకారణం.
థియేటర్స్ నుండి బయటకు వచ్చిన ప్రేక్షకుడ్ని సినిమా ఎలా ఉందంటే ముందుగా థమన్ బ్యాక్ గ్రౌండ్ బాగుందనే చెపుతున్నారు. అంతలా ఇచ్చి పడేసాడు. ఈ తరుణంలో థమన్ కు ప్రభాస్ గోల్డెన్ ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. తన కొత్త చిత్రానికి మ్యూజిక్ అందించామని థమన్ ను అడిగాడట. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీ గా ఉన్నారు. వాటిలో మారుతీ తో సినిమా ఒకటి. దీనికే థమన్ మ్యూజిక్ అందించబోతున్నట్లు తెలుస్తుంది. గతంలో మారుతీ డైరెక్ట్ చేసిన ప్రతి రోజు పండగే చిత్రానికి థమన్ మ్యూజిక్ అందించి సినిమా సక్సెస్ లో ఓ భాగం అయ్యాడు. అందుకే మారుతీ – ప్రభాస్ కలయికలో తెరకెక్కబోయే చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నట్లు ప్రచారం నడుస్తుంది.